Imran Khan: భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందని....
భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందని అన్నారు. తమ దేశ ప్రజలకు ధరాభారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇమ్రాన్ పదవిలో ఉన్న సమయంలో భారత్ పై అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇండియా(India)ను సమర్థిస్తూ కామెంట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండడం వల్లే అది సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ట్వీ్ట్ చేశారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక విదేశాంగ విధానం కోసం ప్రయత్నించినా స్థానిక మీర్ జాఫర్లు, మీర్ సాదిక్‌లు విదేశీ శక్తులకు తలొగ్గి అధికార మార్పిడికి కారణమయ్యారని వివరించారు. తద్వారా తలాతోక లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు.
అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. పెట్రోల్, డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల లీటర్ పెట్రోల్ ధర 9.5 రూపాయల మేర, డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు లక్ష కోట్ల ఆదాయం కోల్పోతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Quad کا حصہ ہونے کے باوجود بھارت نے امریکی دباؤ برداشت کیا اور اپنے عوام کو سہولت فراہم کرنے کیلئے روس سے سستا تیل خریدا۔ ایک آزاد خارجہ پالیسی کے ذریعے ہماری حکومت بھی اسی کے حصول کیلئے کوشاں تھی۔ pic.twitter.com/sMyYMN66WA
— Imran Khan (@ImranKhanPTI) May 21, 2022
దేశంలో ద్రవ్యోల్బణం(inflation) పెరిగిపోవడంతో చమురు ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోధరలు పెరగడంతో.. దాని ప్రభావం నిత్యావసర వస్తువులతో పాటు అన్ని వస్తువులపై కూడా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓవైపు కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెట్రో బాదుడు కారణంగా బస్సు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఊరటనిచ్చింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral News: యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..సింహంతో శునకం పోరాటం.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స