Andhra Pradesh: ‘జగన్ గారూ! ఈసారైనా స్పందించండి’.. సీఎంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సెటైర్లు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అనేక రాజకీయ అంశాలపై విమర్శలు చేసిన ఆయన..

Andhra Pradesh: ‘జగన్ గారూ! ఈసారైనా స్పందించండి’.. సీఎంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సెటైర్లు..
Ap Bjp Chief Somu Veerraju
Follow us
Shiva Prajapati

|

Updated on: May 22, 2022 | 9:53 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అనేక రాజకీయ అంశాలపై విమర్శలు చేసిన ఆయన.. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నుల తగ్గింపు విషయంలోనూ తూర్పారబట్టారు. ‘‘కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయలు తగ్గించింది. 9 కోట్ల మంది పేదలకు లబ్ధి కలిగేలా వంట గ్యాస్ మీద రెండు వందల రూపాయల రాయితీ ప్రకటించారు. మొత్తం లక్షన్నర కోట్ల భారాన్ని కేంద్రం తగ్గించింది. ఎరువుల మీద లక్షా అయిదువేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు.’’ అని పేర్కొన్నారు సోము వీర్రాజు. అయితే, కేంద్రం సుంకాలను తగ్గించినా.. రాష్ట్రం మాత్రం తగ్గించడం లేదంటూ ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలు తగ్గించినా.. ఏపీలో మాత్రం తగ్గించడం లేదని విమర్శించారు. ‘సీఎం జగన్ గారూ.. ఈసారైనా స్పందించండి.’ సైటిరికల్ కామెంట్స్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రజలు క్షమించరని అన్నారు.