Kakani Govardhan Reddy: కాకాణి అంటే మామూలుగా ఉండదు మరి.. అవాక్కైన కన్నడిగులు.. ఎందుకో తెలుసా!?

Kakani Govardhan Reddy: తెలుగే కాదు, కన్నడ కూడా అనర్గళంగా వచ్చంటున్నారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. కేవలం చెప్పడమే కాదు, కన్నడిగులు..

Kakani Govardhan Reddy: కాకాణి అంటే మామూలుగా ఉండదు మరి.. అవాక్కైన కన్నడిగులు.. ఎందుకో తెలుసా!?
Kakani
Follow us
Shiva Prajapati

|

Updated on: May 22, 2022 | 9:53 AM

Kakani Govardhan Reddy: తెలుగే కాదు, కన్నడ కూడా అనర్గళంగా వచ్చంటున్నారు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. కేవలం చెప్పడమే కాదు, కన్నడిగులు సైతం ఆశ్చర్యపోయేలా సూపర్‌గా మాట్లాడారు. అవును, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కన్నడ భాషలో ఇరగదీశారు. కన్నడలో అనర్గళంగా మాట్లాడి, కన్నడిగులను అవాక్కయ్యేలా చేశారు. తాను చదువుకున్న స్కూల్‌లో నిర్వహించిన పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి కన్నడలో మాట్లాడి ఆశ్చర్యపర్చారు.

కర్నాటక స్టేట్‌, శివమొగ్గలోని జవహర్‌లాల్‌ నెహ్రూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో బీటెక్‌ కంప్లీట్ చేశారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ఈ కాలేజీలో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం నిర్వహించారు. అక్కడే చదువుకుని, మంత్రి స్థాయికి ఎదిగిన కాకాణిని చీఫ్‌ గెస్ట్‌గా పిలిచింది కాలేజీ మేనేజ్‌మెంట్‌. దాంతో, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కాకాణి గోవర్ధన్‌. తమ పూర్వ విద్యార్ధి అయిన కాకాణికి గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు. మేళ తాళాలు, డప్పులతో ఘనస్వాగతం పలికారు.

తాను చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్లడంపై ఆనందంలో మునిగితేలారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి. తాను చదువుకున్న రోజులను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుని సంతోషపడ్డారు.