AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెత్తనం చేసేందుకు నేను వైసీపీలోకి రాలేదు.. ఎమ్మెల్యే వల్లభనేని షాకింగ్ కామెంట్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధపడి, తాను వైసీపీకి మద్దతు పలికానని...

Andhra Pradesh: పెత్తనం చేసేందుకు నేను వైసీపీలోకి రాలేదు.. ఎమ్మెల్యే వల్లభనేని షాకింగ్ కామెంట్
Vallabhaneni Vamsi
Ganesh Mudavath
|

Updated on: May 22, 2022 | 12:38 PM

Share

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గురించి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధపడి, తాను వైసీపీకి మద్దతు పలికానని అన్నారు. సీఎం మాటే తనకు శిరోధార్యమని వ్యాఖ్యానించారు. పార్టీ మారి ఎవరిపైనో పెత్తనం చేసేందుకు తాను రాలేదని, ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసమే తాను జగన్‌ వద్దకు వెళ్లానని వివరించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన గద్దె రామ్మోహన్‌ సతీమణి జడ్పీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉంగుటూరులో బరిలోకి దిగితేనే ఏకగ్రీవం సాధ్యం కాలేదని.. కానీ దుట్టా కుమార్తె ఏ విధంగా ఏకగ్రీవంగా జడ్పీటీసీగా గెలుపొందారో అందరికీ తెలిసిందేనని చెప్పారు. టీడీపీలో ఉండగానే తాను వైసీపీ వారిని వేధించలేదని, వ్యక్తిగత గొడవలు లేవన్నారు. ఇప్పుడు కూడా తాను టీడీపీ వారిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే ప్రజలు తనను గెలిపించారనే విషయాన్ని గుర్తుంచుకున్నానని, వారి కోరిక మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. అధికార వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో.. అప్పటికే ఉన్న దుట్టా, యార్లగడ్డ గ్రూపులకు మరో గ్రూపు తోడైంది. దీంతో, ముచ్చటగా మూడు గ్రూపులన్నట్టు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల ఈ మూడువర్గాల మధ్య పోరు మరింత ముదిరింది. వంశీతో కలిసి నడిచేది లేదంటూ కుండ బద్దలు కొట్టేశాయి దుట్టా, యార్లగడ్డ వర్గాలు. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన వైసీపీ హైకమాండ్‌ స‌జ్జలను రంగంలోకి దించింది. ఆయన ఇరువర్గాలతో వేర్వేరుగా మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. వంశీతో క‌లిసి ప‌నిచేసేది లేదంటూ యార్లగడ్డ, దుట్టా వర్గాలు తేల్చి చెప్పేశారు. ఆత్మగౌరవం చంపుకొని వంశీ వెంట తిరగలేమని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Poco X4 GT: పోకో నుంచి అప్‌డేట్‌ వెర్షన్‌తో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ లీక్‌..!

రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ.. ఇప్పటికీ అంతుచిక్కని ఆ గ్రామం మిస్టరీ.. ఎక్కడుందంటే..