Tomato Low Price: అక్కడ 15 రూపాయలు తక్కువకే టమాటా.. పూర్తి వివరాలు మీకోసం..

Tomato Price: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధర సమాన్య ప్రజలను బెంబేలెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Tomato Low Price: అక్కడ 15 రూపాయలు తక్కువకే టమాటా.. పూర్తి వివరాలు మీకోసం..
Tomato
Follow us

|

Updated on: May 22, 2022 | 9:53 AM

Tomato Price: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధర సమాన్య ప్రజలను బెంబేలెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు తక్కువ ధరకే టమాటా అందుబాటులో ఉండేలా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రైతు బజార్లలో టమాటా‌ తక్కువ ధరకే అందించేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

నిత్యావసర ధరలను నుంచి ప్రజలకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రోజురోజుకు పెరుగుతున్న టమోట ధరను నియంత్రించి రైతు బజార్లలో తక్కువ ధరకు అందిస్తుంది. బయట మార్కెట్ కంటే 15 రూపాయల తక్కువకు ప్రొవైడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడ పడమట రైతు బజార్ లో కిలో టమాట 54 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. రైతుల నుంచి 70 నుంచి 80 రూపాయల వరకు కొనుగోలు చేసి.. 15 రూపాయల రాయితీతో రైతు బజార్లలో ప్రజలకు అందిస్తుంది ప్రభుత్వం.

అయితే గతంలో తక్కువ ధర ఉన్నప్పుడు రెండు నుంచి మూడు కేజీల వరకు తీసుకెళ్లేవారని చెప్తున్నారు వ్యాపారులు. ఇప్పుడు టమాట ధర పెరగడంతో అరకేజీ, పావు కేజీ కంటే ఎక్కువ తీసుకోవడం లేదని చెప్పారు వ్యాపారులు. ఇక పంట కూడా అంత క్వాలిటీగా లేదంటున్నారు. మే నెల ఎండలు కావడంతో పంట చివరి స్టేజ్ కి వచ్చిందంటున్నారు రైతులు. రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువగా రాలేదని చెప్తున్నారు. ధర ఎక్కువ ఉన్నప్పటికి పెద్దగా లాభాలు రాలేదని చెప్పుతున్నారు రైతులు. రాష్ట్రంలో టమాటా తగినంత దిగుబడి లేకపోవడంతో.. కర్ణాటక, తెలంగాణ నుంచి టమోటను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్తున్నారు వ్యాపారులు.