రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ.. ఇప్పటికీ అంతుచిక్కని ఆ గ్రామం మిస్టరీ.. ఎక్కడుందంటే..

మన భారతదేశంలో ఇప్పటికీ పలు ప్రాంతాలు.. ఈ మూఢ నమ్మకాలతో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో భూతాలు.

రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ.. ఇప్పటికీ అంతుచిక్కని ఆ గ్రామం మిస్టరీ.. ఎక్కడుందంటే..
Kuldhara
Rajitha Chanti

|

May 22, 2022 | 11:33 AM

ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడ నమ్మకాల పట్ల విశ్వసం ఎక్కువగానే ఉంటుంది..దెయ్యాలు ఉన్నాయని కొందరు నమ్ముతుంటే.. లేవని మరికొందరి విశ్వాసం.. కానీ మన భారతదేశంలో ఇప్పటికీ పలు ప్రాంతాలు.. ఈ మూఢ నమ్మకాలతో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో భూతాలు.. దెయ్యాలు సంచరిస్తున్నాయని.. మరికొన్ని ప్రాంతాలు శపించబడ్డాయని.. ఆత్మలు నివసిస్తుంటాయని అంటుంటారు.. అలాంటి నమ్మకాలతో ఓ ఊరు మొత్తం ఇప్పటికీ ఖాళీ అయ్యింది.. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఓ చిన్న గ్రామం భన్ గర్ కోట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ ప్రాంతంలో వేలాది మంది రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారని చెబుతుంటారు. జైసల్మేర్ ప్రధాన నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం పేరు కులధార. ఇప్పటికీ ఇక్కడికి వెళ్లాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతుంటారు.. రాజస్థాన్ లోని కులధార గ్రామంలో దెయ్యాలు ఉంటాయని ఎన్నో సంవత్సరాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ గ్రామానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

200 సంవత్సరాలుగా ఎడారి.. రాజస్థాన్ లోని కులధార గ్రామం భారతదేశంలోని హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించారు.. దాదాపు 200 ఏళ్లుగా ఈ గ్రామం ఎడారిగా ఉందని అంటుంటారు. ఈ గ్రామాన్ని చూసి అక్కడి ప్రజలు భయంతో వణికిపోతుంటారు. సాయంత్రమే కాదు..పగలు కూడా అక్కడకు వెళ్లేందుకు భయపడతారు. ఈ గ్రామం పలివాల్ బ్రహ్మణులచే స్థిరపడిందని అంటుంటారు.. ఒకప్పుడు ఎంతో సందడిగా ఉండే గ్రామం.. ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది.

శపించబడిన గ్రామం.. ఇక్కడ నివసించే గ్రామ మంత్రి సలీం సింగ్ కు సంబంధించిన చరిత్ర ఈ ప్రదేశానికి సంబంధించినదని అంటుంటారు.. సలీం సింగ్ క్రూరమైన వ్యక్తి.. అతను చేసే పనుల వలన గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడేవారు..గ్రామంలో పన్ను వసూలు చేస్తూ పేదలను వేధించేవాడు.. గ్రామ మంత్రి సలీం.. ఆ గ్రామ పెద్ద కూతురిని చెడు దృష్టితో చూసి.. ఆమెను తన వద్దకు చేర్చుకోవాలని భావిస్తాడు.. కానీ అది జరగదు. సలీం చేసిన ఈ చర్య పలివాల్ బ్రహ్మణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తమ పరువుపై జరిగిన దాడిగా భావించి రాత్రికి రాత్రే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయితే వారు వెళ్ళిపోతూ ఆ గ్రామాన్ని శపించారని.. దీంతో అక్కడున్న సుమారు 5000 మంది అదృశ్యమయ్యారని నమ్ముతుంటారు..

అంతేకాదు.. అప్పటి నుంచి ఈ గ్రామాన్ని దెయ్యాలు ఆక్రమించాయని.. ఇప్పటికీ ఆ గ్రామానికీ సమీపంలో ఉన్న ప్రజలు విచిత్రమైన స్వరాలు వింటుంటారని చెబుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఈ గ్రామం గురించి భిన్నరకాలుగా చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

గమనిక:- ఈ కథనం కేవలం ఊహలపై ఆధారపడి ఉంది.. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని విశ్వసించాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu