Sarakaru Vaari Paata: మహేష్.. కీర్తిలతో వరుసలు కలిపిన యూట్యూబర్.. అన్నా.. వదినా అనడంతో మహేష్ రియాక్షన్..
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..యూఎస్‌లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్..కళావతి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 150 కోట్లు వసూళ్లు సాధించి రికార్డ్స్ సృష్టిస్తోంది. సర్కారు వారి పాట చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్.. డైరెక్టర్.. మహేష్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ సభ్యులతో కలిసి మహేష్.. కీర్తి.. పలువురు యూట్యూబర్లతో చిట్ చాట్ చేశారు. అందులో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు..
సర్కారు వారి పాట చిత్రయూనిట్ యూట్యూబర్లతో జరిపిన చిట్ చాట్‌లో ప్రముఖ యూట్యూబర్ అనిల్ గీలా తన మాటలతో నవ్వులు పూయించాడు.. యూట్యూబర్ అనిల్ మాట్లాడుతూ.. మిమ్మిల్ని అందరూ సార్ అని పిలుస్తారు.. కానీ నేను అన్న అని పిలుచుకుంటాను.. వాట్సాప్ స్టేటస్ కూడా అన్నా అనే పెట్టుకుంటాం .. మీరు తమ్ముడు అని ఒక్కసారి పిలవండి అని అడగ్గా.. చెప్పు తమ్ముడు అంటూ మాట్లడారు మహేష్.. ఆ తర్వాత మహేష్ అందంపై తెలుగు పద్యం పాడి ఆకట్టుకున్నాడు..
అనంతరం హీరోయిన్ కీర్తి సురేష్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వదినా అని పిలవగా.. వెంటనే మహేష్ మాట్లాడుతూ.. కాదమ్మా నువ్వేంటి.. అందరిని వరుసలు కలిపేసుకుంటున్నావ్.. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంటూ కామెడీగా సెటైర్ వేశారు.. దీంతో వెంటనే అనిల్ కీర్తి అక్కా అని పిలవగా.. అక్కా ఏంటీ ? కీర్తి అని పిలవమ్మ అంటూ మరోసారి మహేష్ కలగజేసుకోగా.. అనిల్ మళ్లీ కీర్తి అక్కా అని పిలిచాడు.. దీంతో మహేష్ సైతం ఓకే చెప్పేశారు.. కీర్తిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తను ఇలాగే మంచి మంచి పాత్రలు చేసి తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి వెదజల్లాలని కోరుకుంటున్నా అక్కా.. అంటూ చెప్పుకొచ్చాడు.. దీంతో నువ్వు సాయంత్రం డైరెక్టర్ పరశురామ్ ను కలవమ్మా.. ఇరగదీస్తున్నావు అంటూ అనిల్‌ను అభినందించారు మహేష్..