Deaf Village: ఏడు తరాలుగా ఆ ఊళ్లో అందరూ మూగ, చెవిటి వాళ్లే.. అసలు కారణమేంటో తెలుసా..!
ప్రపంచంలో అనేక ప్రాంత వాసులు కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తారు అని తెలుసా.. తమ గ్రామస్థులకు శాపం ఉందని.. అందుకనే తమ గ్రామస్థులు మూగచెముడు వారీగా మారుతున్నారని విశ్వసిస్తున్నారు. మరి ఆ మూగ, చెవిటివారు ఉన్న గ్రామం గురించి తెలుసుకుందాం.
Deaf Village In The World: ప్రకృతి అనేక రహస్యాలకు నెలవు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వింత సంఘటనలు జరుగుతూ సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. కొన్ని గ్రామాలు అందాలకు నెలవుగా ప్రసిద్ధి చెందితే.. మరికొన్ని వింత వింత ఘటనలతో ప్రపంచ వాసుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో మూఢనమ్మకములు అధికం అని విమర్శించేవారికి.. ప్రపంచంలో అనేక ప్రాంత వాసులు కూడా మూఢనమ్మకాలను విశ్వసిస్తారు అని తెలుసా.. తమ గ్రామస్థులకు శాపం ఉందని.. అందుకనే తమ గ్రామస్థులు మూగచెముడు వారీగా మారుతున్నారని విశ్వసిస్తున్నారు. మరి ఆ మూగ, చెవిటివారు ఉన్న గ్రామం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నివసించే వ్యక్తులు కట కోలోక్ అనే ఒక భాషను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ సంకేత భాష వందల ఏళ్ల నాటిది. ఈ వందల సంవత్సరాల నాటి భాష ఆ గ్రామంలోని ప్రజలకు మాత్రమే అర్థం అవుతుంది. అందుకే ఈ గ్రామానికి పర్యాటకుల సందర్శన చాలా తక్కువగా ఉంటుంది.
ఇండోనేషియాలోని బెంగాలా గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి సంజ్ఞలలో మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే ఈ గ్రామంలోని చాలా కుటుంబాలోని వ్యక్తులు మాట్లాడలేరు, వినలేరు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు సంజ్ఞలలో మాట్లాడటం నేర్చుకుంటారు. దీంతో ఈ గ్రామం ‘చెవిటి గ్రామం’ గా పేరు సొంతం చేసుకుంది. ప్రపంచంలో మాట్లాడలేని, వినలేని గ్రామం ఇదే.
ఈ ఊరిలో పుట్టిన పిల్లల్లో చాలా మందికి వినికిడి లోపంతో పాటు మూగవారు. దీంతో తమ భావాలను ఇతరులకు వ్యక్తం చేయడానికి సైగలను అలవాటు చేసుకుంటారు. దీనిని కట కోలోక్ అనే సంకేత భాష అని అంటారు. ఈ సైగల భాష ఈ ఊరి ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్వ కార్యాలయంలో కూడా వాడుకలో ఉంది. ఈ గ్రామ జనాభా సుమారు మూడు వేల మంది.
శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ప్రాంతంలో DFNB3 అనే జన్యువు ఉనికి ఉంది. ఇక్కడ పుట్టిన వారిలో ఈ జన్యువు ఏడు తరాలుగా కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రజలు చెవిటివారుగా జన్మిస్తారు. కాగా ఈ గ్రామంలో నివసించే ప్రజలు శాపం కారణంగానే తమకు ఈ చెవిటితనం వచ్చిందని భావిస్తున్నారు.
ఈ గ్రామంలో నివసించే స్థానికుల కథనం ప్రకారం.. చాలా సంవత్సరాల క్రితం మాయమాటలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో వారు ఒకరినొకరు చెవిటివారిగా మారమని శపించుకున్నారు. దీంతో ఏడు తరాల నుంచి ఇప్పటి వరకు ఈ శాపం కొనసాగుతూ.. తమ గ్రామస్థులు పుట్టిన తర్వాత మూగ, చెవిటి వారుగా మారుతున్నారని ప్రజల నమ్మకం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.