Viral Video: భూమి లోపల దట్టమైన అడవి.. చైనాలో ఊహించని అద్భుతం
చైనాలో(China) అద్భుతం జరిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. భూమి పైన కాదండోయ్.. భూమిలోపల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ లేయ్ కౌంటీలోని ఓ సింక్ హోల్‌లో మే ఆరో...
చైనాలో(China) అద్భుతం జరిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. భూమి పైన కాదండోయ్.. భూమిలోపల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ లేయ్ కౌంటీలోని ఓ సింక్ హోల్‌లో మే ఆరో తేదీన ఈ దట్టమైన అడవిని కనుగొన్నారు. ఈ సింక్‌హోల్(Sink Hole) అడుగున 40 మీటర్ల ఎత్తైన చెట్లున్నాయి. అంటే కొబ్బరి చెట్లకంటే రెండింతలు ఎత్తయినవి అన్నమాట. దీని లోపల మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్‌హోల్ పైవరకూ ఉన్నాయి. ఈ అడవి చూడముచ్చటగా ఉందని అన్వేషకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్(Viral) అవుతోంది. కాగా ఈ సింక్‌హోల్ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పుతో 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది. ఇప్పటివరకు కనిపెట్టిన అన్ని సింక్‌హోల్స్‌లో ఇదే పెద్దదిగా చెబుతున్నారు. ఈ అడవిలో ఉన్న ప్రత్యేకమైన చెట్లు, ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయిన మొక్కలు ఇంకా రకరకాల జీవులు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
A cave exploration team discovered a giant sinkhole in southern China, bringing the number of such sinkholes in the county to 30. pic.twitter.com/a4IVFogIG9
ఇవి కూడా చదవండి— South China Morning Post (@SCMPNews) May 11, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral Video: ఇది రేసు గుర్రం కాదు.. పక్కా మాస్ డ్యాన్స్ గుర్రం.. వీడియో చూస్తే షాకవుతారు..
Shani Jayanti 2022: శని జయంతి రోజున శనీశ్వరుడి ప్రసన్నం కోసం చేయాల్సిన పూజలు, నియమాలు ఏమిటంటే..