Viral Video: ఇది రేసు గుర్రం కాదు.. పక్కా మాస్ డ్యాన్స్ గుర్రం.. వీడియో చూస్తే షాకవుతారు..
వివాహ వేడుకలలో గుర్రాలు డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా ?. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లిళ్లు.. ఇప్పుడు ఘనంగా జరుపుతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో.. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య తమ వివాహలను చేసుకుంటున్నారు. ఆటపాటలతో ఎంతో సరదాగా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే కాకుండా.. వధూవరులు కూడా ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో వధూవరులు, కుటుంబసభ్యులు డ్యాన్స్ చేసి ఉంటారు. కానీ వివాహ వేడుకలలో గుర్రాలు డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా ?. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అందులో పెళ్లి వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. అందంగా రెడీ చేసిన మండపం.. చుట్టూ బంధుమిత్రులతో ఆ ప్రదేశం మొత్తం ఎంతో సరదాగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఓ తెల్ల గుర్రం బజాయ్ శబ్దానికి అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. తన కాళ్లను అటు ఇటు కదిలిస్తూ అందంగా డ్యాన్స్ చేసింది. గుర్రం డ్యాన్స్ చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.. డీజే ట్యూన్ లకు తగినట్టుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుర్రం డ్యాన్స్ చేయడం చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram