Putin: “వైద్య చికిత్స కోసం పుతిన్ తరచూ విరామం తీసుకుంటున్నారు:.. బ్రిటీష్ గూఢచారి కీలక కామెంట్
రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని బ్రిటిష్ గూఢచారి అన్నారు. వైద్యం కోసం ఆయన తరచుగా....

రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని బ్రిటిష్ గూఢచారి అన్నారు. వైద్యం కోసం ఆయన తరచుగా సమవేశాలకు రాకపోవడం, వచ్చినా మధ్యలో విరామం తీసుకోవడం వంటివి చేస్తారని చెప్పారు. అయితే.. పుతిన్ అనారోగ్యం గురించి కచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. “పుతిన్(Putin) తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎంత వరకు ఆయన ఆరోగ్యం క్షీణించింది అనే విషయాలు తెలియరాలేదు. ఆయన అనారోగ్యం రష్యా పాలనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని” బ్రిటీష్ గూఢచారి వెల్లడించారు. పుతిన్ ఇటీవల పొత్తికడుపు నుంచి ద్రవాన్ని తొలగించేందుకు సర్జరీ చేయించుకున్నారని ఓ వార్తా కథనం వెల్లడించింది.ఈ సర్జరీ సక్సెస్ అయిందని మరో వార్తా కథనం వెల్లడించింది.
గతంలోనూ బ్రిటన్ మాజీ గూఢచారి ఒకరు పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని అన్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని వెల్లడించారు. దీనిని ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపెడుతూ అమెరికాకు చెందిన ఒక మేగజీన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కచ్చితంగా ఆయన అనారోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అది నయమయ్యేదేనా, కాదా అనేదీ తెలియదు. కానీ యుద్ధ సమీకరణాల్లో అదీ ఒక భాగమేనని వ్యాఖ్యానించారు.
కాగా, గత నెలలో పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి రష్యాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘ప్రొయెక్ట్’ ప్రచురించిన కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ 2016 నుంచి థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, దానికి చికిత్స చేయించుకునేందుకే కొన్నిసార్లు అజ్ఞాతంలోకి వెళ్లారని ఆ కథనం తెలిపింది. చికిత్సలో భాగంగా ఎర్ర జింక కొమ్ముల నుంచి తీసిన రసంతో పుతిన్ స్నానం చేయాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. రష్యా అధ్యక్ష కార్యాలయ సర్జన్ తరచూ నల్ల సముద్రంలోని పుతిన్ నివాసానికి వెళ్లేవారని ఆ కథనంలో తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Shepherd: అదృష్టం వరించింది.. మాములుగా కాదు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన గొర్రెల కాపరికి..
Cock: యజమానిని నిద్ర లేపడానికి ఈ కోడి ఏంచేసిందో చూడండి..! క్యూట్ కోడి అంటున్న నెటిజనం..