- Telugu News Photo Gallery World photos Nearly 400 Brits break world record for most mermaids ever in one place
World Record: సుమారు 400 మంది మత్య్సకన్యలు ఒకేచోట కనువిందు.. గిన్నిస్ బుక్ రికార్డ్‌లో చోటు
World Record: ప్రపంచ రికార్డు సృష్టించడం పిల్లల ఆట కాదు . దానికి కఠోర శ్రమతో పాటు తెలివి తేటలు కూడా అవసరం. ప్రపంచంలో ఇలాంటి అనేక రికార్డులు ఉన్నాయి. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడం కోసం ఎందరో ఎన్నో కష్టాలు పడ్డారు.. పడుతున్నారు కూడా.. ఈరోజు మత్స్యకన్యలు సృష్టించిన ప్రపంచ రికార్డ్ గురించి తెలుసుకుందాం..
Updated on: Jun 04, 2022 | 2:47 PM

మత్స్యకన్యలు సృష్టించిన ప్రపంచ రికార్డ్ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఎవరైనా బర్గర్ తింటూ ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా, బంగీ జంపింగ్ ద్వారా మరొకరు సరికొత్త రికార్డు సృష్టించారు.

అయితే రంగురంగుల మత్స్యకన్యలు ప్రపంచ రికార్డు సృష్టించాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మత్స్యకన్యలు అసలు లేవని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు రికార్డులు ఎలా సృష్టిస్తాయి అని ఆలోచిస్తున్నారా.. మనం ఇప్పుడు అలాంటి మత్స్యకన్యల గురించి తెలుసుకుందాం.

నిజానికి వీరు మనుషులే కానీ మత్స్యకన్యలు లాగా ఉన్నారు. అవును, బ్రిటన్‌లోని ప్లైమౌత్‌లో వందలాది మంది మత్స్యకన్యలు లా రెడీ అయ్యి.. ఒకే చోట సమావేశమైనప్పుడు, ఆ ప్రాంతమంతా వారి అందాలతో నిండిపోయింది.

వాస్తవానికి, దాదాపు 400 మత్స్యకన్యలు స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కలిసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా సరి కొత్త రికార్డును కూడా సృష్టించారు. విశేషమేమిటంటే చిన్నారుల నుంచి వృద్ధులు, మహిళల వరకు అందరూ ఈ జలకన్యల విన్యాసాల్లో పాలుపంచుకున్నారు. ఈ రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదుకానుంది.

మీడియా నివేదికల ప్రకారం, 2022 మెర్మైడ్ ఛాలెంజ్ ప్లైమౌత్‌లోని డెవాన్‌లో జరుగుతోంది, ఇందులో పురుషులు, మహిళలు, పిల్లలతో సహా మొత్తం 388 మంది పాల్గొన్నారు. ఇప్పటి వరకూ మత్య్సకన్యల అతిపెద్ద సమావేశం ఇదే. ఇంతకుముందు మెర్‌మైడ్స్, మెర్మెన్‌ల సమావేశం ఒకే చోట జరిగింది, ఇందులో 300 మంది పాల్గొన్నారు. అప్పుడు ఆ సమావేశం గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ ను బీట్ చేస్తూ.. సరికొత్త మత్య్సకన్యల సమావేశం జరిగి.. సరికొత్త కొత్త ప్రపంచ రికార్డు సృష్టించబడింది
