AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎవరు నడపకుండానే రోడ్డుపైకి వెళ్లిన రిక్షా.. ఇది దెయ్యం అంటున్న నెటిజన్లు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ప్రతి రోజు పులులు, సింహాలు, పాములు, మొసళ్లు తదితర జంతువులకు సంబంధించిన వీడియోలో..

Viral Video: ఎవరు నడపకుండానే రోడ్డుపైకి వెళ్లిన రిక్షా.. ఇది దెయ్యం అంటున్న నెటిజన్లు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Jun 04, 2022 | 6:13 PM

Share

Viral Video: ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ప్రతి రోజు పులులు, సింహాలు, పాములు, మొసళ్లు తదితర జంతువులకు సంబంధించిన వీడియోలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. మరి కొన్ని ఫన్నిగా ఉంటాయి. ఇక తాజాగా ఓ రిక్షాకు సంబంధించిన ఓ వింత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడిన ఈ క్లిప్ క్రేజీ వైరల్‌గా మారింది. ఈ వీడియో మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. దీనిని చూసిన కొందరు దయ్యం అని సంభోదిస్తున్నారు.

తుఫాను సమయంలో రద్దీగా ఉండే రహదారినిపై ఓ రిక్షా నిలిపి ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ రిక్షా ముందుకు వెళ్లడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డు పక్కన ఉన్న ఈ వీడియో కొన్ని సెకన్ల తర్వాత ఒక రిక్షా రోడ్డుపైకి వెళ్లడం చూడవచ్చు. ఆ రిక్షాను ఎవ్వరు కూడా నడపడం లేదు. దానంతట అదే ముందుకు కదలడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

రిక్షా రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపైకి వచ్చి మళ్లీ వెనక్కి వచ్చేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 760k పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా పోస్టు చేయబడింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికి వచ్చినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us