Viral Video: మనిషైనా, సింహమైనా ప్రేమ కోసం పోరాడాల్సిందే.. ఈ ఫైట్ చూస్తే మీరూ షాకవుతారు!
ఇదొక క్రేజీ వీడియో.. మీరు అబ్బాయిలు.. అమ్మాయి ప్రేమ కోసం కొట్టుకోవడం చూసి ఉంటారు.. అయితే ఇక్కడ రెండు సింహాలు.. ఓ ఆడ సింహంపై మనసు పారేసుకుని కొట్లాటకు దిగాయి..
ఏదొక సమయంలో ఇద్దరు అబ్బాయిలు.. ఓ అమ్మాయి కోసం పోరాడటం మీరు చూసే ఉంటారు. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు, ఆమె ప్రేమ పొందేందుకు ఆ ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారు. అయితే ఇలాంటి యుద్దాన్ని ఏ జంతువైనా పోరాడటం మీరెప్పుడైనా చూశారా.? అది కూడా అడవికి రారాజైన సింహం.. అవునండీ! మీరు విన్నది నిజమే.. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆడ సింహాన్ని ఆకట్టుకునేందుకు రెండు మగ సింహాలు ఒకదానితో మరొకటి పోట్లాట పెట్టుకున్నాయి. వీడియో చూస్తే ఆ రెండు సింహాలు.. ఆడ సింహంపై మనసు పారేసుకుని ఉంటాయి.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆడ సింహం కోసం ఎదురుపడ్డ రెండు మగ సింహాలు.. ఒకదానితో ఒకటి డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్‌కు దిగాయి. ఆ రెండింటి యుద్దాన్ని చూసి.. ఆడ సింహం అక్కడ నుంచి వెళ్లిపోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ఈ వీడియోను ‘theglobalanimalsworld’ అనే ఇన్‌స్టా పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. దీనికి వేలల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇదేం పిచ్చి ప్రేమో’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఆమె నాకంటే.. నాకు..’ ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మాదిరిగా ఈ సింహాలు కొట్టుకుంటున్నాయి’ అని మరొకరు కామెంట్ పెట్టారు.