AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Retail CEO: గుడ్‌బై చెప్పిన అమెజాన్ రిటైల్ సీఈవో డేవ్ క్లార్క్.. 23 ఏళ్ల తరువాత సంచలన నిర్ణయం..

Amazon Retail CEO: ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ రిటైల్ వ్యాపారానికి CEOగా ఉనన్ డేవ్ క్లార్క్ రాజీనామా చేశారు. ఆయన దాదాపు 23 ఏళ్ల పాటు పనిచేసిన తరువాత కంపెనీని విడిచిపెడుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది.

Amazon Retail CEO: గుడ్‌బై చెప్పిన అమెజాన్ రిటైల్ సీఈవో డేవ్ క్లార్క్.. 23 ఏళ్ల తరువాత సంచలన నిర్ణయం..
Amazon Retail Ceo
Ayyappa Mamidi
|

Updated on: Jun 04, 2022 | 4:51 PM

Share

Amazon Retail CEO: ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ రిటైల్ వ్యాపారానికి CEOగా ఉన్న డేవ్ క్లార్క్ రాజీనామా చేశారు. ఆయన దాదాపు 23 ఏళ్ల పాటు పనిచేసిన తరువాత కంపెనీని విడిచిపెడుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ వేగవంతమైన లాజిస్టిక్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో క్లార్క్ కీలక పాత్ర పోషించారు. అమెజాన్‌తో 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తరువాత డేవ్ క్లార్క్ ఇతర అవకాశాలను కొనసాగించేందుకు కంపెనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని అమెజాన్ CEO ఆండీ జాస్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కంపెనీలో జూలై 1 వరకు పనిచేస్తారని వెల్లడించారు. US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఫైలింగ్ లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.

క్లార్స్క్ అమెజాన్ ఆపరేషన్స్ పాత్‌వేస్ ప్రోగ్రామ్‌లో మే 1999లో చేరారు. MBA ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఒక రోజు తర్వాత క్లార్క్ కంపెనీలో చేరారు. కంపెనీ వినియోగదారుల కార్యకలాపాలను రూపొందించడంలో, స్కేల్ చేయడంలో కంపెనీకి సహాయకారిగా నిలిచారు. ఆయన అనేక తరాల FCలను రూపొందించిన బృందాలకు నాయకత్వం వహించారు. అమెజాన్ రవాణా నెట్‌వర్క్‌ను మొదటి నుంచి నిర్మించారు. సంస్థ అంతటా గణనీయమైన ప్రతిభను అభివృద్ధి చేశారని అమెజాన్ CEO ఆండీ జాస్సీ తెలిపారు.

క్లార్క్ 23 సంవత్సరాల క్రితం.. గ్రాడ్ స్కూల్ నుంచి అమెజాన్‌లో చేరినప్పుడు పెద్ద వ్యక్తిగత పందెంలా భావించాడు. క్లార్క్ కంపెనీలో చేరిన కొత్తలో అది కేవలం ఆరు సెంటర్లతో ఉన్న చిన్న కంపెనీ మాత్రమే. తాను సీటెల్‌కు వచ్చినప్పుడు.. కలిసిన వ్యక్తుల కారణంగా అమెజాన్‌లో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. క్లార్క్ ఆన్‌లైన్ స్టోర్‌లు, ఫిజికల్ స్టోర్‌లు, థర్డ్-పార్టీ సెల్లర్ల మార్కెట్‌ప్లేస్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వ్యాపారాన్ని పర్యవేక్షించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.