Wife For Sale: ఆన్‌లైన్‌లో అమ్మకానికి భార్య.. త్వరపడండి అంటూ.. రకరకాలుగా స్పందిస్తున్న నెటిజనం

Wife For Sale: ఆన్‌లైన్‌లో అమ్మకానికి భార్య.. త్వరపడండి అంటూ.. రకరకాలుగా స్పందిస్తున్న నెటిజనం

Anil kumar poka

|

Updated on: Jun 04, 2022 | 9:50 AM

పండగలప్పుడు కూడా తన భార్య ఇంటిపట్టున ఉండటం లేదని ఓ భర్త తన భార్యను అమ్మకానికి పెట్టేశాడు. ఈ విచిత్ర సంఘటన..ప్యూర్టో రికో డి గ్రాన్ కానరియాలో జరిగింది. ఎసెక్స్‌కు చెందిన రాబీ మెక్‌మిలన్‌, సారా అనే దంపతులు...


పండగలప్పుడు కూడా తన భార్య ఇంటిపట్టున ఉండటం లేదని ఓ భర్త తన భార్యను అమ్మకానికి పెట్టేశాడు. ఈ విచిత్ర సంఘటన..ప్యూర్టో రికో డి గ్రాన్ కానరియాలో జరిగింది. ఎసెక్స్‌కు చెందిన రాబీ మెక్‌మిలన్‌, సారా అనే దంపతులు 20 ఏళ్లుగా హాయిగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తన భార్య పండగల సమయంలో ఇంట్లో ఉండకపోవడంతో రాబీకి కాస్త బాధ కలిగింది. అంతే.. ఏప్రిల్ 17న ఫేస్‌బుక్‌లో తన భార్యను అమ్మకానికి పెట్టేసాడు. నా భార్య అమ్మకానికి ఉంది, ఎవరైనా కొనాలనుకుంటే.. తనను సంప్రదించమని కోరాడు. అతను తన పోస్ట్‌లో ‘సగటు కంటే మెరుగైనది’ అని రాశాడు. అంతేకాదు.. తన భార్యని అమ్మకానికి పెడుతూ.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. చాలా విషయాలు ప్రస్తావించాడు. భార్యకు సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా పోస్ట్ చేశాడు. అయితే, రాబీ తన భార్యను ఎంత ధరకు అమ్మాలనుకుంటున్నాడో మాత్రం చెప్పలేదు. లైఫ్ బోరింగ్‌ కొట్టిన భర్త ఇంత భారీ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఈ పోస్టుపై స్పందిస్తూ.. నా భార్య లక్షల్లో ఒకటి, కానీ ప్రస్తుతం ఆమె మార్కెట్లో అందుబాటులో లేదని సరదాగా కామెంట్ చేశారు. కాగా.. సారా భర్త చేసిన పనికి ఆమె కోపగించుకోకపోగా.. ఇలాంటి చిలిపి పనులు అతనికి అలవాటేనని లైట్‌ తీసుకోవడం కొసమెరుపు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!