AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తప్పు చేసింది ఒకరు.. బలైంది మాత్రం ఇంకొకరు.. వీడియో చూస్తే షాకవుతారు..

Trending Video: ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 'animals_powers' పేరుతో పంచుకున్నారు. వార్తలు రాసే వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Viral Video: తప్పు చేసింది ఒకరు.. బలైంది మాత్రం ఇంకొకరు.. వీడియో చూస్తే షాకవుతారు..
Animal Viral Video
Venkata Chari
|

Updated on: Jun 04, 2022 | 5:40 AM

Share

సోషల్ మీడియా(Social Media) ప్రపంచంలో ఫన్నీ వీడియోల హవా నడుస్తోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలకు ఇందులో అగ్రస్థానంగా నిలుస్తోంది. వీటిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ, షేర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడూ మరింత చర్చనీయాంశంగా కూడా మారుతుంటాయి. ఇదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఎద్దు కోపానికి పాపం ముసలాయన బలయ్యాడు. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఒక్కోసారి తప్పు ఎవరో చేస్తారు.. దానికి శిక్ష మాత్రం వెరుకరికి పడుతుంది. ఈ సామెతకు అచ్చుగుద్దేలా ఉంది ఈ వీడియో. అందుకే కారణం లేకుండా ఎవరినీ డిస్టర్బ్ చేయకూడదని అంటుంటారు. ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతోందో ఈ వీడియోలో చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో మీరు రోడ్డుపై నిలబడి ఉన్న ఎద్దును చూడవచ్చు. ఎవరో దాని మీద నీరు చిమ్మారు. దీంతో ఎద్దు కోపం కట్టలు తెంచుకుంది. ఇదే సమయంలో రోడ్డుపై వెళ్తోన్న వారిని టార్గెట్ చేసుకుంది. కొంతమంది తప్పించుకున్నా.. ఓ ముసలాయన మాత్రం అకారణంగా బలయ్యాడు. ఓ బైక్ ఎద్దు వెనుక నుంచి వేగంగా వెళుతోంది. ఆ బైక్ వెనుకనే సైకిల్‌పై వస్తుంటాడు. కోపంతో ఉన్న ఎద్దు.. ఆ సైకిల్‌ను టార్గెట్ చేసింది. అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. ఎద్దు సైక్లిస్ట్‌పై తన కొమ్ముతో దాడి చేసి, గాలిలోకి విసిరి చాలా బలంగా కిందికి పడిపోతాడు. ఈ వీడియో క్లిప్‌ను చూస్తే అతనికి గాయాలు తప్పవని అర్థమవుతోంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘animals_powers’ పేరుతో పంచుకున్నారు. వార్తలు రాసే వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ‘ఎవరికైనా అర్థం లేకుండా కోపం తెప్పించడం వల్ల ఫలితం ఇలాగే ఉంటుంది’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘అర్థం లేకుండా ప్రజలు జంతువులను ఎందుకు ఇబ్బంది పెడతారో తెలియదు..! అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. వీరు కూడా ఈ వీడియోను చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..