AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేగంగా వెళ్తోన్న ట్రక్.. కట్ చేస్తే.. సినిమా స్టైల్లో దొంగల ఎంట్రీ.. వీడియో చూసి షాకవుతోన్న నెటిజన్లు..

17 సెకన్ల ఈ షాకింగ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో devtaru_52 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. వార్తలు రాసే వరకు వందల కొద్దీ వ్యూస్, లైక్‌లను సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ వీడియో చూపి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వేగంగా వెళ్తోన్న ట్రక్.. కట్ చేస్తే.. సినిమా స్టైల్లో దొంగల ఎంట్రీ.. వీడియో చూసి షాకవుతోన్న నెటిజన్లు..
Viral News
Venkata Chari
|

Updated on: Jun 03, 2022 | 6:25 AM

Share

ప్రతి దొంగ దొంగతనాని (Theif Viral Video)కి తనదైన శైలిని కలిగి ఉంటాడు. ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. సినిమా చూసి స్ఫూర్తి పొంది, సినిమా స్టైల్లో దొంగతనాలు చేసే దొంగలు ఎందరో ఉన్నారు. వాటిని చూసిన తర్వాత జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాజాగా ఓ దొంగ వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో దొంగ చోరీకి పాల్పడ్డాడు. టామ్ క్రూజ్ నుంచి హృతిక్ రోషన్ వరకు ప్రతి ఒక్కరూ వాళ్ల సినిమాల్లో చాలా అరుదుగా చేసిన హైరిస్క్ దొంగతనాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లో నటులు దొంగల పాత్ర పోషించడం మీరు తరచుగా చూస్తూనే ఉంటుంటారు. ఆశ్చర్యపోయేలా దొంగతనం చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాజాగా ఇద్దరు దొంగల వీడియో కూడా అదే స్థాయిలో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత అంతా షాకవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, హైవేపై ట్రక్కు వెళ్తున్నట్లు మీరు చూడొచ్చు. దాని వెనుక ఓ వ్యక్తి వేలాడుతున్నాడు. అతను చాలా ధైర్యంగా వస్తువులతో నిండిన ట్రక్కు నుంచి ఒక గోనెను నిశ్శబ్దంగా కింద పడవేస్తాడు. ఆ తర్వాత వెనుక వస్తున్న అతని సహచరుడు ట్రక్కులాగా తన బైక్‌ను ఉంచాడు. ఆవ్యక్తి కదులుతున్న ట్రక్ నుంచి దిగి, వేగంగా వెళ్తున్న బైక్‌పై హాయిగా కూర్చున్నాడు. ఈ దొంగలను చూస్తుంటే హాలీవుడ్ సినిమాల ప్రభావానికి లోనైనట్లు అనిపిస్తుంది.

17 సెకన్ల ఈ షాకింగ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో devtaru_52 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. వార్తలు రాసే వరకు వందల కొద్దీ వ్యూస్, లైక్‌లను సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ వీడియో చూపి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. “ఈ దొంగ లోపల ఒక పెద్ద ఆత్మ ఉంది సోదరా..! అంటూ ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘ఇది చూసి మంచి యాక్షన్ హీరోలకు కూడా చెమటలు పట్టించేలా’ ఉంది అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

View this post on Instagram

A post shared by Mandar Gurav (@devtaru_52)

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..