Viral Video: ఇదేందిరయ్యా.. పాములతో ఇలా నిద్రపోతారా.. వీడియో చూస్తే షాకవుతారంతే?

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి రెండు పాములతో ఎలాంటి భయం లేకుండా నిద్రపోతున్నాడు.

Viral Video: ఇదేందిరయ్యా.. పాములతో ఇలా నిద్రపోతారా.. వీడియో చూస్తే షాకవుతారంతే?
Snake Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 03, 2022 | 7:55 AM

సోషల్ మీడియాలో వైరల్ వీడియోల(Viral Video) సందడి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ ఎన్నో వీడియోలు నెట్టింట్లో షేర్ అవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని తెగ నవ్విస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం ఎంతో షాకిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి రెండు ప్రమాదకరమైన కొండచిలువలతో హాయిగా నిద్రపోతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ వ్యక్తి పాములతో హ్యాపీగా ఎలా నిద్రపోతున్నాడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ వీడియోలోని వ్యక్తి పసుపు రంగులో ఉన్న రెండు పెద్ద బర్మీస్ పైథాన్ పాములతో కనిపించాడు. ఈ వ్యక్తిపై పాములు చాలా హాయిగా కదులుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ పాములు ఎలాంటి హాని చేయకుండా వ్యక్తిపై అటుఇటు తిరుగుతున్నాయి. సదరు వ్యక్తి మాత్రం నిద్రలో చాలా బిజీగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను స్నేక్‌బైటెస్ట్‌వి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘చాలా రోజుల తర్వాత కొన్నిసార్లు, నాకు ఇష్టమైన వారితో నిద్రపోవడం అవసరం, నేను ఇలా ఒంటరిగా ఉండలేను’ అంటూ క్యాఫ్షన్ అందించారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షలకు పైగా వీక్షించగా, 25 వేల మందికి పైగా లైక్ చేశారు.

ఈ వీడియో చూసి యూజర్లు కూడా చాలా విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. పాములు చాలా అందంగా ఉన్నాయని ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి ప్రమాదకరమైన పాములతో ఎలా జీవిస్తున్నారంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్రియాన్ బార్జిక్ నిర్వహిస్తున్నాడు. ఆయనో జంతు ప్రేమికుడు. అన్ని రకాల సరీసృపాల గురించిన ఎంతో సమాచారాన్ని నెట్టింట్లో పంచుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో అతను నాగుపాము తలను ముద్దాడటానికి ప్రయత్నించాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..