AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KSRTC : తరగతి గదిగా మారిన డబుల్ డెక్కర్‌ బస్సు.. ఆటపాటలు అన్నీ అందులోనే..

అక్కడి ప్రభుత్వ పాఠశాల కొత్త సొబగులు అద్దుకుంది..ఒకప్పుడు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చిన డబుల్ డెక్కర్ బస్సు..ఇప్పుడక్కడి అక్కడి విద్యార్థులకు చదువుకునే బడిగా మారింది.

KSRTC : తరగతి గదిగా మారిన డబుల్ డెక్కర్‌ బస్సు.. ఆటపాటలు అన్నీ అందులోనే..
Ksrtc1
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2022 | 7:24 AM

Share

అక్కడి ప్రభుత్వ పాఠశాల కొత్త సొబగులు అద్దుకుంది..ఒకప్పుడు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చిన డబుల్ డెక్కర్ బస్సు..ఇప్పుడక్కడి అక్కడి విద్యార్థులకు చదువుకునే బడిగా మారింది. తరగతి గదిగా మారిన డబుల్‌డెక్కర్‌ బస్సులో టీవీ, ఎయిర్ కండీషనర్, కుర్చీలు, రంగురంగుల టేబుల్,పుస్తకాలు ఉంచడానికి అల్మారా కూడా ఏర్పాటు చేశారు. కేరళ మనకాడ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణా సంస్థ (టీటీఐ) క్యాంపస్‌లో ఉన్న పాఠశాలకు బస్సును విరాళంగా ఇచ్చారు.

కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌టిఆర్‌సి)కి చెందిన డబుల్ డెక్కర్ బస్సును తరగతి గదిగా మార్చారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు వినోదభరితంగా మారింది. పాత ఫ్లోర్ బస్సులో రెండు అంచెల తరగతి గదిని నిర్మించారు. ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ స్క్రాప్ చేయడానికి ఉంచిన రెండు బస్సుల్లో ఒకదానిని ఇలా సిద్ధం చేశారు. మనకాడ్‌లోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (టీటీఐ) ఆవరణలో ఉన్న పాఠశాలకు బస్సును విరాళంగా అందజేశారు. కానీ డ్రైవర్ సీటు,స్టీరింగ్ తొలగించలేదు. దాంతో పిల్లలు వాటితో ఆడుకోవటానికి వీలుగా ఉంది. వారు బస్సులో ఉన్నట్లుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బస్సుకు రెండు వైపులా పక్షులు, జంతువులు, చెట్ల బొమ్మలు చిత్రించారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగా, పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇది ఆకర్షణీయ కానుకగా మారింది.

పాఠశాల బస్సు పై భాగం చదువుకోవటానికి, ఆటపాటల కోసం రూపొందించబడింది. రెండేళ్ల తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకుంటున్న ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఈ తరగతి అందుబాటులో ఉండనుంది. ఈ నెల 17న ప్రభుత్వ పాఠశాలకు రెండు బస్సులను అందించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు అంగీకరించారు. 239 బస్సులు తొమ్మిదేళ్లకు పైగా పాతబడ్డవి. ఐదు లక్షల కిలోమీటర్లకు పైగా నడిచిన ఈ బస్సులు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. అందుకే వాటిని రద్దు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించిందని ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కార్పొరేషన్ తెలిపింది.