Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
పుణ్యం కోసం మన పెద్దవాళ్లు చాలా మంది రామ కోటి రాస్తుంటారు.. .కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ, సారీ నామ జపం విన్నారా..? కానీ, ఓ చోట స్కూల్ ఆవరణ, పాఠశాల గోడలు, లోనికి వెళ్లే మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ, సారీ అని రాసి...
పుణ్యం కోసం మన పెద్దవాళ్లు చాలా మంది రామ కోటి రాస్తుంటారు.. .కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ, సారీ నామ జపం విన్నారా..? కానీ, ఓ చోట స్కూల్ ఆవరణ, పాఠశాల గోడలు, లోనికి వెళ్లే మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ, సారీ అని రాసి ఉండటం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.బెంగళూరులోని సుంకడకట్టే ప్రాంతంలో శాంతిధామ పాఠశాల దాని చుట్టుపక్కల వీధుల్లో ఎరుపు రంగులో ‘సారీ.. సారీ.. సారీ` అనే రాయడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికులను, పాఠశాల అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. స్కూల్ ఎంట్రెన్స్ నుండి మొదలు పెడితే…, గోడలు, మెట్లపై సారీ.. సారీ.. సారీ అని కొందరు ఆకతాయిలు రాశారు. చుట్టుపక్కల వీధుల్లో అలాగే రాశారు. ఇదంతా చూసిన స్థానికులకు ఏమీ అర్థం కాలేదు.. వెంటనే స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు యువకులు సారీ.. సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. దాంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

