Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లోని మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయం కుబేరుని నిధిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ అమ్మవారికి బంగారు, వెండి ఆభరణాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వాటిని ప్రసాదంగా పంచుతారు. దీపావళి సందర్భంగా.. ఈ ఆలయంలో దంతేరస్ నుండి ఐదు రోజుల పాటు దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో, ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే ఆభరణాలు, డబ్బుతో అలంకరిస్తారు. ఈ ఆలయంలో ధన్ తేరాస్ రోజున మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కుబడులను చెల్లించుకుంటారు. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఎవరూ తిరిగి ఖాళీ చేతులతో వెళ్ళరు. భక్తులకు బంగారం, వెండి, లేదా నగదు ఇలా ఏదో ఒక రూపంలో ప్రసాదం ఇస్తారు.ధన్‌తేరస్ నుండి దీపావళి వరకు మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సమర్పించినా అది రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొలదీ బంగారం, వెండి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా తమ కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం. వారం రోజుల తర్వాత భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారం, వెండి తిరిగి అందజేస్తారు. ఇందుకోసం భక్తులు తమ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..