Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Anil kumar poka

|

Updated on: May 20, 2022 | 9:22 AM

కట్టుకున్న భర్తను ఏమార్చి… మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారిలో ఒకరి ప్రాణాలు తీసిన ఓ నయవంచకి నిజరూపం బైటపడింది. పది రోజుల కిందట హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన మర్డర్ మిస్టరీలో వెలుగు చూసిన తాజా షాకింగ్ న్యూస్ ఇది.


కట్టుకున్న భర్తను ఏమార్చి… మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వారిలో ఒకరి ప్రాణాలు తీసిన ఓ నయవంచకి నిజరూపం బైటపడింది. పది రోజుల కిందట హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన మర్డర్ మిస్టరీలో వెలుగు చూసిన తాజా షాకింగ్ న్యూస్ ఇది. మే 4వ తేదీ అర్ధరాత్రి మీర్‌పేట్‌లోని నందిహిల్స్‌ చౌరస్తాలో దాడికి గురై చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత మృతిచెందిన యశ్మకుమార్ కేసులో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లనుంచి విస్తుగొలిపే విషయాలు బైటపడ్డాయ్. విక్రమ్‌ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకున్న శ్వేతారెడ్డి… ఫేస్‌బుక్‌లో పరిచయమైన యశ్మకుమార్‌తో నాలుగేళ్ల కిందట రిలేషన్ పెట్టుకుంది. తర్వాత కృష్ణా జిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజ్ వైస్‌ ప్రిన్సిపాల్‌ కొంగళ్ల అశోక్‌తో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో న్యూడ్‌ఫోటోలు బయట పెడతానని హెచ్చరించిన యశ్మకుమార్‌ని వదిలించుకోవాలని ప్లాన్ చేసి.. ఆ స్కెచ్‌లో సెకండ్ బాయ్‌ఫ్రెండ్‌ అశోక్‌ని వాడేసుకుంది. బైక్ మీద వెళ్తున్న యశ్మకుమార్‌ని సుత్తితో దారుణంగా కొట్టి పారిపోయాడు అశోక్. ఆ దారిన వెళ్తున్న కొందరు యశ్మకుమార్‌ను కాపాడి ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేక… రెండురోజుల తర్వాత చనిపోయాడు. స్పాట్‌లో దొరికిన స్మార్ట్‌ఫోన్ కాల్‌ డేటాను ట్రేస్ చేసి.. అసలు మిస్టరీని ఛేదించారు పోలీసులు. భర్తకు తెలీకుండా ఒక బాయ్‌ఫ్రెండ్ సాయంతో మరో బాయ్‌ ఫ్రెండ్‌ని చంపించిన శ్వేతారెడ్డి… ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Gold in Sea: బీచ్‌లో బంగారం దొరుకుతుందట..! సముద్ర తీరానికి ఎగబడ్డ జనం..!

Electrician Love: అబ్భా ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది అంటే ఇదే మరి..! గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఎలక్ట్రీషియన్ వింత పని..!

Viral Video: దాని కోసం ఇలా చేస్తారా..? భర్త ఇంట్లో బాత్ రూమ్ లేదని భార్య ఆత్మహత్య..!

Published on: May 20, 2022 09:22 AM