Viral News: మనోడి టెస్టే వేరు.. కుక్కలా బతకాలనుకుని ఏకంగా రూ.11 లక్షలు ఖర్చు పెట్టాడు

కుక్కలా బతకంకోసం లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి.. చివరికి తాను అనుకున్నది సాధించాడు. మరి మనిషి కుక్కలా ఎలా మారిపోతాడు.. ఇదేమన్నా సినిమానా అని అనుకోకండి. నిజంగా నిజం.. మరి అతను తన కుక్కలా మారాలి అన్న కలని ఎలా నిజం చేసుకున్నాడంటే..

Viral News: మనోడి టెస్టే వేరు.. కుక్కలా బతకాలనుకుని ఏకంగా రూ.11 లక్షలు ఖర్చు పెట్టాడు
Man Fulfills Dream
Follow us
Surya Kala

|

Updated on: May 24, 2022 | 1:43 PM

Viral News: ‘జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి’ అన్నారు పెద్దలు.. ఎవరికైనా జీవితం మీద విసుగు వస్తే.. నా జీవితం కంటే కుక్క జీవితం మేలు అనుకోవడం సర్వసాధారంగా వినిపించే మాట.. ఇదే విధంగా ఓ వ్యక్తిని విచిత్రమైన కోరిక కలిగింది. అదే విశ్వాసం గల జంతువు కుక్కలా బతకడం.. అదే అతని లక్ష్యం, కల కూడా .. అయితే తాను లక్ష్యం సాధించాలంటే కలలు కంటే సరిపోదని దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని నిర్ణయించుకున్నాడు.  కుక్కలా బతకంకోసం లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టి.. చివరికి తాను అనుకున్నది సాధించాడు. మరి మనిషి కుక్కలా ఎలా మారిపోతాడు.. ఇదేమన్నా సినిమానా అని అనుకోకండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి ఎప్పట్నుంచో శునకంలా బతకాలని కల.. లక్ష్యం కూడా. దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. కుక్కంటే ఇష్టం కాబట్టి దాని బాడీ లాంగ్వేజ్‌ అంతా అలవర్చుకున్నాడు. మరి కుక్కలా కనిపించడం ఎలా? అది కూడా అచ్చం ఒరిజినల్‌లా కనిపించాలి. దీంతో అతను స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్‌షాప్ జెప్పెట్‌ని సంప్రదించా  డు. విషయం చెప్పి.. ఆల్ట్రా రియలిస్టిక్‌ డాగ్‌ కాస్ట్యూమ్‌ తయారు చేయమని చెప్పాడు. వాళ్లు కూడా ఈ విషయాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని. కుక్కల శరీర నిర్మాణ శైలిని అధ్యయనం చేశారు. 40 రోజుల్లో అస్సలు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఈ కుక్క కాస్ట్యూమ్‌ను తయారు చేశారు. ఇందుకోసం 11 లక్షలు పైనే చార్జ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

తన బట్టలను చూసి టోకో ఆనందానికి అంతే లేదు. ఈ దుస్తులు వేసుకుని.. తన యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. అలాగే ఫొటోస్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. అంతే.. ఆ వీడియోలు స్థానిక టీవీల్లో టెలికాస్ట్‌ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు కొందరు ‘కుక్కలా బతకాలన్న ఆశ ఏందిరా..!?’ అనుకుని ఆశ్చర్యపోతే.. మరికొందరు టోకో ఆశను అర్థం చేసుకుని.. ‘ఇతరులకు హాని కలగకుండా ఆయన జీవితాన్ని ఆయన బతుకుతున్నాడు.. మనకేం’ అంటూ కామెంట్‌ చేశారు. అయితే.. ఇప్పటికీ టోకో కుక్కలానే బతుకుతున్నాడా.. లేక కాస్ట్యూమ్‌ తీసేసి.. మనిషిలా మారాడా అన్న విషయం మాత్రం తెలియలేదు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌   వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..