Viral: చేపల కోసం వెళ్తే.. వలకు చిక్కిన వింత జీవి.. జాలర్లకు ఊహించని షాక్!
చేపల కోసం వేటకు వెళ్లిన ఇద్దరు అమెరికన్ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లోని ఓ సరస్సులో చేపల వేటకు వెళ్లిన...
మీకు తెలియని ఓ విషయం ఏంటంటే.. చేపలలో 28 వేలకు పైగా జాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ ప్రదేశాల్లో మీకు కనిపిస్తాయి. కొన్ని చేపల గురించి అందరికీ తెలుసు గానీ.. అరుదైన చేపల గురించి మాత్రం చాలామంది తెలియదు. అందులో ఒకటే ఎలిగేటర్ గార్. ఇది చాలా అరుదైన చేప జాతికి చెందినది. అలాగే అరుదుగా కనిపిస్తుంది కూడా.
చేపల కోసం వేటకు వెళ్లిన ఇద్దరు అమెరికన్ మత్స్యకారులకు ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లోని ఓ సరస్సులో చేపల వేటకు వెళ్లిన ఈ ఇద్దరికీ ఐదు అడుగుల పొడవున్న ఎలిగేటర్ గార్ చేప చిక్కింది. ఈ అరుదైన చేపను జెట్ బ్లాక్ రివర్ బీస్ట్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చేప ఎంత భయంకరంగా ఉందో.. మీరు ఫోటోలో చూడవచ్చు.
చేపలు ఎంత భయానకంగా ఉన్నాయో ఫోటోలో చూడవచ్చు. ఈ ఎలిగేటర్ గార్ చేపలు ప్రశాంతమైన నదుల్లో ఉంటాయని.. అవి మనుషులకు హాని తలపెట్టవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవరైనా వాటిని పట్టుకోవడానికి లేదా దాడి చేయడానికి ప్రయత్నించినట్లయితే, అవి తమను తాము రక్షించుకోవడానికి ఎంతకైనా వెనకాడవని చెప్పారు. కాగా, గతంలో హ్యూస్టన్ సమీపంలో మరొక మత్స్యకారుడికి 8 అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న 300-పౌండ్ల ఎలిగేటర్ గార్ చేప చిక్కింది.