AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: కొబ్బరికాయల లోడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు సంగతి తెలిస్తే మీటర్ లేచుద్ది!

అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. స్మగ్లర్లు లెక్క చేయడం లేదు.. దందాను ఆపడం లేదు.

Odisha: కొబ్బరికాయల లోడ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు సంగతి తెలిస్తే మీటర్ లేచుద్ది!
Lorry
Ravi Kiran
|

Updated on: May 24, 2022 | 12:32 PM

Share

అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ.. స్మగ్లర్లు లెక్క చేయడం లేదు.. దందాను ఆపడం లేదు. గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ.. అధికారుల కళ్లు గప్పి రాష్ట్రాలను దాటించేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో సుమారు 16 క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమాలోని సీన్‌ను రిపీట్ చేయాలనుకున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. జయపురం పోలీసులకు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందని సమాచారం అందటంతో ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు స్థానిక ఘాట్ రోడ్డులో మాటు వేశారు. ప్రతీ వెహికిల్‌ను ముమ్మరంగా చెక్ చేస్తుండగా.. అతి వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు వారి కంటపడింది. దాన్ని ఆపి సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరికాయలు, 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. స్మగ్లర్లు చాలా తెలివిగా కొబ్బరికాయల లోడ్‌తో గంజాయి బస్తాలను కవర్ చేశారు. అయితే ఏముంది పోలీసులు వారి ఆగడాలకు కూల్‌గా చెక్ పెట్టారు. పట్టుబడిన సరుకు సుమారు రూ. 81 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆ ట్రక్కు నడుపుతోన్న బీహారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
ఒక్క చాక్లెట్‌తో కొండంత బలం.. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
స్టార్ ప్లేయర్లు పింక్ రంగు బూట్లే ఎందుకు వేసుకుంటున్నారో తెలుసా?
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు