Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. చిక్కింది ఏంటో చూసి జాలర్లు కళ్లు తేలేసారు!

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో జాలర్లు వల విసరగా.. అది కాసేపటికే బరువెక్కింది..

Viral: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. చిక్కింది ఏంటో చూసి జాలర్లు కళ్లు తేలేసారు!
Fish
Follow us

|

Updated on: May 23, 2022 | 1:41 PM

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. సంద్రంలో జాలర్లు వల విసరగా.. అది కాసేపటికే బరువెక్కింది.. అబ్బా.. ఏదో భారీ చేపే పడుంటదని జాలర్లంతా సంబరపడిపోయారు. అతి కష్టం మీద వలను లాగారు. వేటకు వెళ్లిన జాలర్ల కష్టం ఫలిచ్చింది. కాసులు కురిపించే చేప వలకు చిక్కింది. ఈ ఘటన విశాఖ తీరంలోని మహారాణిపేటలో చోటు చేసుకుంది. అదేంటి అక్కడ ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం కదా.! వచ్చే నెల వరకు సముద్రం చేప దొరకదుగా.. మరి వలకు పెద్ద చేప ఎలా చిక్కిందని ఆలోచిస్తున్నారా.?

వేట విరామంలో ఇంజిన్ బోట్లతో సముద్రంలో చేపల వేట నిషేధం.. కానీ తెర పడవల మీద సంద్రంలోకి వేటకు వెళ్లొచ్చు. అలా సముద్రంలోకి ఆదివారం చేపల వేటకు వెళ్లిన జాలర్ల పంట పండింది. వారికి భారీ సంఖ్యలో కొమ్ముకోనం చేపలు వలకు చిక్కాయి. ఒక్కొక్కొటి 80 నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ కొమ్ముకోనం చేపలకు మార్కెట్‌లో భలే గిరాకీ. 100 కిలోల చేప సుమారు రూ. 20 వేలకు పైగా ధర పలుకుతుందట. వీటిని కేరళవాసులు ఇష్టపడి తింటారట.

Fishes

Latest Articles
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులను దానం చేస్తే విశిష్ట ఫలితాలు
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
బ్యాంకుకు వెళ్లి ఈ ఫారమ్‌ను పూరించండి.. ఖాతా నుంచి డబ్బులు కట్
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో జగన్..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!