AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending video: రెండు డేగల మధ్య ప్రేమానురాగం..! గాల్లో ఎగురుతూనే పంచుకున్న దృశ్యం అమేజింగ్!! వీడియో చూడాల్సిందే..

ఇక్కడ డేగలకు సంబంధించిన వీడియో ఒకటి మనం చూడొచ్చు. ఆ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూస్తే మీరుకూడా చలించిపోతారు. ఈ వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Trending video: రెండు డేగల మధ్య ప్రేమానురాగం..!  గాల్లో ఎగురుతూనే పంచుకున్న దృశ్యం అమేజింగ్!! వీడియో చూడాల్సిందే..
Falcon
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2022 | 7:53 PM

Share

పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలను నెటిజన్లు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జంతువులు, పక్షుల మధ్య స్నేహం, ప్రేమానురాగాలకు సంబంధించిన అనేక వీడియోలు నెటిజన్ల మనసును దోచేస్తుంటాయి. అలాంటి వీడియోలకు ప్రజలు దాసోహం అవుతుంటారు. పదేపదే ఆ వీడియోలను షేర్‌ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తుంటారు. తాజాగా ఇప్పుడు డేగకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. వీడియో చూసిన నెటిజనం ఫిదా అవుతున్నారు.

ఇక్కడ డేగలకు సంబంధించిన వీడియో ఒకటి మనం చూడొచ్చు. ఆ వీడియో చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూస్తే మీరుకూడా చలించిపోతారు. ఈ వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఈ వీడియోలో మీరు డేగను చూడవచ్చు. డేగ అప్పుడే ఒక పక్షిని వేటాడి దాన్ని ముక్కుతో పట్టుకుని ఎగురుతోంది. అదే సమయంలో, మరొక డేగ, దానికి అడ్డుగా వచ్చింది. రెండు డేగలు కలిసి ఎగురుతున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు..అయితే, కాస్త కిందకు ఎగురుతున్న డేగ దాని నోటిని పైకి చాచింది. అంతలోనే వేటాడిన డేగ తను పట్టిన ఎరను నోరు తెరిచిన డేగకు అందించింది. ఈ దృశ్యం అద్భుతంగా ఉంది.. గాలిలోనే ఒక డేగ మరో డేగకు ఆహారం అందించటం వావ్‌ అనిపిస్తోంది. ఇప్పుడు ఇదే వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రెండు డేగల మధ్య కనిపించే ఈ ప్రత్యేకమైన బంధం, కెమిస్ట్రీ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రేమను పొందుతోంది. డేగ తెలివితేటలను అందరూ కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ ఖాతా నుండి డేగలు, ఇతర పక్షులకు సంబంధించిన అనేక వీడియోలు కూడా పోస్ట్ చేయబడ్డాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 36 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ స్థానంలో ముగ్గురు తోపులు..!
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!