AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Daughter: ఎమ్మెల్యే కూతురి అనుచిత ప్రవర్తన.. నా కారునే ఆపుతారా అంటూ ఖాకీలకే చుక్కలు చూపించింది..

ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసింది. అంతటితో ఆగలేదు..అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నోటికి వచ్చినట్టుగా తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది.

MLA Daughter: ఎమ్మెల్యే కూతురి అనుచిత ప్రవర్తన.. నా కారునే ఆపుతారా అంటూ ఖాకీలకే చుక్కలు చూపించింది..
Mla Daughter
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2022 | 6:44 PM

Share

ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసింది. అంతటితో ఆగలేదు..అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నోటికి వచ్చినట్టుగా తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ విలేకరితో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఆమెకు పోలీసులు రూ. 1000ల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, వీడియోకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం మేరకు వివరాలు పరిశీలించగా…

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ నింబావలి కుమార్తె రేణుకా నింబావళికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గురువారం తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారులో వచ్చిన అరవింద్ నింబావలి కూతురు, ఆమె స్నేహితులను సిగ్నల్ బ్రేక్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె తన విశ్వరూపం ప్రదర్శించింది. ఎమ్మెల్యే కూతురు పోలీసుల ముందు తెగ హల్‌చల్‌ చేసింది. ఇదంతా కూడా వీడియోలో రికార్డైంది. ఇప్పుడు అదే వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబవాళీ కూతురు బెంగళూరులో బెంజ్ కారు నడపుకుంటూ వెళ్తుంది. అయితే, ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడినా కూడా ఆమె సిగ్నల్ జంప్ చేసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే, ఆమె ట్రాఫిక్ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. తాను ఎమ్మెల్యే కూతురినంటూ వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఇదంతా కూడా అక్కడ ఉన్న ఓ రిపోర్ట్ వీడియో తీయడంతో అతడితో కూడా దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఆమెకు ట్రాఫిక్ పోలీసులు రూ. 1000 జరిమానా విధించారు. అదేవిధంగా ఆ కారుపై ఇంతముందుకు రూ. 9 వేల వరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయని, మొత్తం ఆమె రూ. 10 వేల జరిమానాను చెల్లించిందని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి