Indian American Sopen Shah: బైడెన్ నిర్ణయం, మరో భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఇండో అమెరికన్‌కు తమదేశంలో కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఇండో-అమెరికన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఇండో అమెరికన్‌కు తమదేశంలో కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఇండో-అమెరికన్ సోపెన్ బి షాను వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విస్కాన్సిన్‌కి యూఎస్ స్టేట్స్ అటార్నీగా అధ్యక్షుడు బైడెన్ నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్షభవనం ప్రకటించింది.
జూన్ 6న శ్వేతసౌధం ప్రకటించిన ఆరుగురు యూఎస్ అటార్నీల జాబితాలో సోపెన్ షా కూడా ఉన్నారు. ట్రంప్ హయాంలో నియమితుడైన స్కాట్ బ్లేడర్ స్థానంలో సోపెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, సోపెన్ నియామకం ఆమోదం పొందితే మాడిసన్‌లోని యూఎస్ అటార్నీ ఆఫీస్‌కి నాయకత్వం వహించే రెండవ మహిళగా ఆమె ఘనత దక్కించుకుంటారు.
Another #EmergeAlum has been nominated for the judiciary! Congratulations to @EmergeWI alum Sopen B. Shah for being nominated by @POTUS to serve as the U.S. attorney for the Western District of Wisconsin. #EmergeNowhttps://t.co/TtGCpWObRm
— Emerge (@EmergeAmerica) June 7, 2022
ఇకపోతే, సోపెన్ షా కెంటుకీలో స్థిరపడ్డారు. 2015లో యేల్ లా స్కూల్ నుంచి జేడీ, 2008లో హార్వర్డ్ కాలేజీ నుంచి ఏబీ మాగ్నా కమ్ లాడ్‌ను అందుకున్నారు. 2019 నుంచి పెర్కిన్స్ కోయి ఎల్‌ఎల్‌పీ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్నారు. సోపెన్ షా 2017 నుంచి 2019 వరకు విస్కాన్సిన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా హైప్రొఫైల్ సివిల్, క్రిమినల్ అప్పీల్స్‌లో వాదనలు వినిపించారు.