వీడు నిజంగానే ఘటికుడు.. పట్ట పగలు, మిట్టమధ్యాహ్నం, నేరుగా బ్యాంకులోకే వెళ్లి చోరీ చేశాడు..

వారికి కాయకష్టం చేతకాదు, జల్సాలు, ఈజీ మనీ అలవాటుతో దొంగతనాలు చేస్తూ బతికేస్తుంటారు. బంగారం, వెండి నగలు, ఇతరాత్ర విలువైన వస్తువులు చోరీ చేస్తూ పూట గడిపేస్తుంటారు. అలాంటి దొంగలు చాలా వరకు చాకచక్యంగా వ్యవహరిస్తారు. తాజాగా ..

వీడు నిజంగానే ఘటికుడు.. పట్ట పగలు, మిట్టమధ్యాహ్నం, నేరుగా బ్యాంకులోకే వెళ్లి చోరీ చేశాడు..
Ong Cc
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 09, 2022 | 3:49 PM

వారికి కాయకష్టం చేతకాదు, జల్సాలు, ఈజీ మనీ అలవాటుతో దొంగతనాలు చేస్తూ బతికేస్తుంటారు. బంగారం, వెండి నగలు, ఇతరాత్ర విలువైన వస్తువులు చోరీ చేస్తూ పూట గడిపేస్తుంటారు. అలాంటి దొంగలు చాలా వరకు చాకచక్యంగా వ్యవహరిస్తారు. తాజాగా ప్రకాశం జిల్లలోనూ ఓ దొంగ తన తెలికి మరింత పదునుపెట్టాడు. ఏకంగా యూనియన్ బ్యాంకులోనే చోరీకి పాల్పడ్డాడు. అతడు బ్యాంకులో ప్రవేశించాడు. అంత సెక్యూరిటీ, సిబ్బంది, వినియోగదారులు అనేక మంది ఉండగానే, అతడు దర్జాగా చోరీచేసి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పూర్తివివరాల్లోకి వెళితే…

ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పట్టపగలే జరిగిన బ్యాంక్‌ చోరీ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  కోమరోలు యూనియన్ బ్యాంకులో పట్టపగలు ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యాంక్‌లోకి ప్రవేశించాడు.  బ్యాంకు లోపల ఐదు తులాల, రెండు గ్రాముల బంగారంతో పారిపోయాడు. బ్యాంక్ బయట ఉన్న సీసీ కెమెరాలో ఈ సీన్ మొత్తం రికార్డ్ అయ్యింది. అసలు బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే బ్యాంకు లోపల సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే అదే సమయంలో బయటి సీసీ కెమెరాలు మాత్రం పనిచేశాయి. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. సీసీ ఫుటేజ్ రికార్డును స్వాధీనంచేసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.