Model gaushala: దేశంలోనే తొలి మోడల్ గోశాల.. సోలార్ ప్లాంట్ నుండి బయోగ్యాస్ ప్లాంట్ వరకు, మరెన్నో..

దేశరాజధాని ఢిల్లిలో తొలి మోడల్‌ గోశాల రూపుదిద్దుకుంటోంది. ఢిల్లీ అభివృద్ధిశాఖ మంత్రి గోపాల్ రాయ్ నజఫ్‌గఢ్‌లోని ఖేడా డాబర్‌లో ఉన్న హరే కృష్ణ గోశాలను సందర్శించారు.

Model gaushala: దేశంలోనే తొలి మోడల్ గోశాల.. సోలార్ ప్లాంట్ నుండి బయోగ్యాస్ ప్లాంట్ వరకు, మరెన్నో..
Model Gaushala
Follow us

|

Updated on: Jun 08, 2022 | 9:05 PM

దేశరాజధాని ఢిల్లిలో తొలి మోడల్‌ గోశాల రూపుదిద్దుకుంటోంది. ఢిల్లీ అభివృద్ధిశాఖ మంత్రి గోపాల్ రాయ్ నజఫ్‌గఢ్‌లోని ఖేడా డాబర్‌లో ఉన్న హరే కృష్ణ గోశాలను సందర్శించారు. ఈ గోశాలను ఢిల్లీ మోడల్ గోశాలగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఢిల్లీలోని మోడల్ గోశాలలో సోలార్ పవర్ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీంతో పాటు బయోగ్యాస్ నుండి వెలువడే అవశేషాల నుండి కూడా కంపోస్ట్ తయారు చేయనున్నట్టు తెలిపారు. అభివృద్ధి మంత్రి గోపాల్ రాయ్, గోశాలను పరిశీలించిన అనంతరం గోశాల పాత నిర్మాణంపై నిర్మించిన 500 kW ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్‌ రాయ్‌ మాట్లాడుతూ..ఢిల్లీని మోడల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఢిల్లీలోని గోశాలలను మోడల్ గోశాలగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వం తదుపరి చర్యగా తెలిపారు. ఇది ఢిల్లీలోని పశువులకు సరైన వాతావరణాన్ని అందించడమే కాకుండా, దానికి సంబంధించి ప్రజలకు వివిధ రకాల ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుందన్నారు.

ఢిల్లీలోని గోశాలలను మోడల్‌గా అభివృద్ధి చేసేందుకు మొదటి దశలో నజాఫ్‌గఢ్‌లోని హరే కృష్ణ గౌశాలను అభివృద్ధి చేయనున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు. భవిష్యత్తులో, ఢిల్లీలోని మిగిలిన గోశాలలు కూడా ఈ నమూనా కింద అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ గోశాలలో ఆవులు ఉండేందుకు, మేతకు, వైద్యానికి, సంచరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. ఈ గోశాలలు స్వయం సమృద్ధి సాధించడంతోపాటు పర్యావరణహితంగా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఈ గోశాలలో రైతులకు, పశువుల పెంపకందారులకు, పర్యావరణ పరిరక్షకులకు ఎప్పటికప్పుడు శిక్షణ కూడా అందించనున్నారు.

ఇకపోతే, నజాఫ్‌గఢ్‌లోని ఖేడా డాబర్‌లోని హరే కృష్ణ గోశాల 24 ఎకరాలలో విస్తరించి ఉందని చెప్పారు. హరే కృష్ణ గోశాలను ఢిల్లీ మోడల్ గోశాలగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీని కింద వివిధ పనుల ప్రాజెక్టుల కింద ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ప్రధానంగా గోశాల నుంచి దాదాపు 5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. గోశాల ప్రధాన ప్రవేశ ద్వారం ముందు ఐజీఎల్ ద్వారా బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం, బయోగ్యాస్ ప్లాంట్ అవశేషాలతో సేంద్రియ ఎరువును తయారు చేయడం వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..