Telangana liquor: ఎనీ టైం మందు..! అదే అడ్డాగా వ్యాపారుల అక్రమార్జన, రాష్ట్రం దాటుతున్న సరుకు

అక్కడ మద్యం అక్రమ రవాణా మూడు లారీలు, ఆరు కాటన్లు అన్న చందంగా సాగుతోంది. జిల్లాలోని కోటపల్లి నుండి మద్యం కాటన్లను మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్నారు. చడిచప్పుడు లేకుండా సరిహద్దు దాటుతున్న వైనం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

Telangana liquor: ఎనీ టైం మందు..! అదే అడ్డాగా వ్యాపారుల అక్రమార్జన, రాష్ట్రం దాటుతున్న సరుకు
Liquor Home Delivery
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2022 | 8:04 PM

మంచిర్యాల జిల్లాలో మద్యం అక్రమ రవాణా మూడు లారీలు, ఆరు కాటన్లు అన్న చందంగా సాగుతోంది. జిల్లాలోని కోటపల్లి నుండి మద్యం కాటన్లను మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్నారు. చడిచప్పుడు లేకుండా సరిహద్దు దాటుతున్న వైనం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలోని గడ్చిరోల్లి, చంద్రపూర్, వర్దా జిల్లాల్లో మద్యపాన నిషేధం ఉండడంతో మద్యాన్ని అక్రమార్కులు అక్కడికి తరలించి రెట్టింపు ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అధికారులకు మద్యం సరఫరా విషయం తెలిసినా పట్టించుకోక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చినా నిర్లక్షం వహించడం వెనుక అంతరార్ధం ఏమిటో అర్థం కావడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోటపల్లి మండలంలోని వెంచపల్లి, సుపక, జనగామ, ఆలుగామ, పుగా సిరా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా మద్యం కాటన్లను ప్యాసింజర్ ఆటో లో ఎక్కించి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తరలిస్తున్నారు.

సాధారణంగా ప్రాణహిత తీర ప్రాంతాలు దట్టమైన అడవులతో నిండి ఉండడం, మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో రాత్రిళ్లు ఎక్సెజ్, పోలీస్ అధికారుల తనిఖీలు పెద్దగా కనిపించవు. ఇదే అదునుగా చేసుకుని లక్షల విలువైన సరుకును సరిహద్దు దాటిస్తున్నారు. ఈ మద్యం దందా మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. మద్యాన్ని కమిషన్ల రూపంలో మహా రాష్ట్రకు తరలించి రోజుకు రూ.లక్షలలో జేబులు నింపుకుంటున్నరంటే ఏస్థాయిలో దందా జరుగుతుందో. అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెల ఎక్సెజ్, పోలీస్ శాఖ వారికి మద్యం దుకాణాదారులు, అక్రమార్కులు ముడుపులు అప్పు జెప్పుతుండడతోనే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కోటపల్లి మండలంలోని బ్రాందీ షాపులోని మందును తెలంగాణ ప్రజలు తాగేది తక్కువ. మహారాష్ట్రకు సరఫరా అయ్యేది ఎక్కువ అన్నట్లు ఉంది. అందువల్లనే కోటపల్లి మండల కేంద్రానికి మంజూరైన రెండు బ్రాందీ షాపులలో ఒక దానిని పారుపల్లి గ్రామానికి తరలించి అక్కడి నుంచి మహారాష్ట్రకు అక్రమంగా మందు సరఫరా చేస్తున్నారు. ఈ తతంగం అంతా ఎక్సెజ్, పోలీస్ అధికారులకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.