Boy in borewell: బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు, మూడు గంటలు, 40 నిమిషాల రెస్క్యూ.. ఆఖరుకు ఏం జరిగింది!

మరోమారు అదే నిర్లక్ష్యం, ఎంతమంది చిన్నారులు బలైపోయినా జనాల్లో అదే నిద్రావస్థ.. నిర్లక్ష్యం కారణంగా బోరుబావిలో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఏదో ఒక చోట తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో చిన్నారి బోరుబావిలో ..

Boy in borewell: బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు, మూడు గంటలు, 40 నిమిషాల రెస్క్యూ.. ఆఖరుకు ఏం జరిగింది!
Borewell
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2022 | 6:10 PM

మరోమారు అదే నిర్లక్ష్యం, ఎంతమంది చిన్నారులు బలైపోయినా జనాల్లో అదే నిద్రావస్థ.. నిర్లక్ష్యం కారణంగా బోరుబావిలో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఏదో ఒక చోట తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో చిన్నారి బోరుబావిలో పడిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. కానీ, అదృష్ట వశాత్తు..పసివాడికి ఈ భూమ్మీద నూకలున్నాయి కాబోలు,..వాడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అక్కడి అధికారులు, సిబ్బంది బాలుడిని కేవలం 40 నిమిషాల్లోన రెస్క్యూ చేసి కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

గుజరాత్‌ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లాలోని పొలంలో రెండేళ్ల బాలుడు లోతైన బోరుబావిలో పడిపోయాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శివం అనే బాలుడు తన తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకునే దుదాపూర్ గ్రామంలోని పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న జిల్లా పరిపాలన అధికారులు స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌తో పాటు ఇక్కడికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లోని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందాన్ని అప్రమత్తం చేశారు. బాలుడు బోరుబావిలో పడి 20-25 అడుగుల లోతులో చిక్కుకున్నాడని ధృంగాద్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ తెలిపారు.

స్థానిక యంత్రాంగం.. ఆర్మీ, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుల సహాయాన్ని కూడా కోరింది. ఆర్మీ, పోలీసులు, జిల్లా పరిపాలన సిబ్బంది, గ్రామస్తులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారంతా సమన్వయంతో పనిచేసి రాత్రి 10.45 గంటలకు చిన్నారిని బోరుబావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. బాలుడిని ధృంగాద్ర పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. పోలీసులు, ఆర్మీ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 40 నిమిషాల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయినట్టు ధృంగాధ్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!