Fake Police: విక్రమార్కుడినే మించిన వెంకటరమణ, ఎన్ని అలియాస్‌లో, వాడి కన్నుపడిందా అది స్వాహా..!!

అతని పేరు వెలుగుల వెంకట రమణ అలియాస్ వెంకట రమణ రెడ్డి, అలియాస్ రాహుల్. ఇంకా అలియాస్ ల పేరుతో అరడజను వరకు పేర్లే ఉన్నాయి. ఊరు అన్నవరం సమీపంలోని శంకవరం గ్రామం. అప్పుడప్పుడు అల్లూరి..

Fake Police: విక్రమార్కుడినే మించిన వెంకటరమణ, ఎన్ని అలియాస్‌లో, వాడి కన్నుపడిందా అది స్వాహా..!!
Police Thief
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2022 | 4:53 PM

తలపై టోపీ.. శరీరం పై ఖాకీ డ్రెస్.. చేతిలో లాఠీ..! అతనిని చూస్తే కొందరు సలాం కూడా చేస్తుంటారు. అతనేదో పోలీస్ ఆఫీసర్ కాదు… కానిస్టేబుల్ అంతకంటే కాదు.. అచ్చం పోలీసు మాదిరిగా కనిపించినా… చేసేది మాత్రం నేరాలు..! కాస్ట్లీ బైక్ లు కనిపిస్తే చాలు… మస్కా కొట్టి మాయ చేసే వరకు అస్సలు వదలడు. ఇంతకీ ఎవడా పర్సన్… వాడి బ్యాక్‌ గ్రౌండ్‌ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. అతని పేరు వెలుగుల వెంకట రమణ అలియాస్ వెంకట రమణ రెడ్డి, అలియాస్ రాహుల్. ఇంకా అలియాస్ ల పేరుతో అరడజను వరకు పేర్లే ఉన్నాయి. ఊరు అన్నవరం సమీపంలోని శంకవరం గ్రామం. అప్పుడప్పుడు అల్లూరి జిల్లా పాడేరు సమీపంలోని నక్కల పుట్టు లోని పెద్దమ్మ దగ్గర నివాసం ఉంటాడు. అయితే, ఇతగాడు మస్కా కొట్టి మాయ చేయడంలో దిట్ట. సెల్ఫోన్ లు, కొత్తరకం బైక్లను చూస్తే అస్సలు వదలడు. రెండు మూడుసార్లు ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి.. పోలీస్ కానిస్టేబుల్ గా నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వారిని మాయ మాటలతో నమ్మించి వారి దగ్గర ఉన్న అసలు బైక్లతో ఉడా ఇస్తాడు.

టీనేజీ కాలం నుంచే… నేరాలు చేయడం మొదలు పెట్టిన ఈ నకిలీ పోలీస్.. పలు మార్లు జైలు కూడా వెళ్లి వచ్చాడు. రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, బుచ్చయ్యపేట, నర్సీపట్నం, గాజువాక, కంచరపాలెం ప్రాంతాల్లో వెంకటరమణ రెడ్డి నేరాలు చేశాడు. 2018 లో అరెస్టయి జైలుకు వెళ్ళిన రమణారెడ్డి బయటకొచ్చాడు. మళ్లీ తాజాగా ఏలూరు రైల్వే స్టేషన్ లో సెల్ ఫోన్ దొంగతనం కేసులో అరెస్టై 50రోజుల రిమాండ్ గడిపాడు. మే 24న బయటకు వచ్చి వారం రోజుల వ్యవధిలో మళ్లీ విశాఖలో నేరం చేశాడు. తాజాగా మే 31న.. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ అఫెన్స్ చేసాడు. కానిస్టేబుల్ లో అక్కడ తిరుగుతూ కనిపించాడు. ఈశ్వరరావు అనే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికీ కానిస్టేబుల్ లా నమ్మించ్చాడు. అర్జంట్ పని ఉందంటూ.. బైక్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తా నంటూ నమ్మించాడు. తన దగ్గర ఉన్న డ్యూక్ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు వెంకటరమణా రెడ్డి అలియాస్ రాహుల్. ఎంతకీ తిరిగి రాకపోవడంతో… ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని పోలీసు అవుట్ పోస్టుల ఆరా తీశాడు బాదితుడు ఈశ్వరరావు. అటువంటి వారు ఎవరు కానిస్టేబుల్స్ లేరని చెప్పడంతో మోసపోయానని గుర్తించి తల పట్టుకున్నాడు.జరిగిదానిపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించగా సదరు దొంగ పోలీస్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

గతంలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడిన నేపథ్యంలో వెంకట రమణా రెడ్డి అలియాస్ రాహుల్ ను ట్రాక్ చేయగలిగారు పోలీసులు. కటకటాల వెనక్కి నెట్టారు. నేరాలు చేసి ఎత్తుకుపోయిన బైక్ లను.. గంజాయి మాఫియాతో చేతులు కలిపి వారికి ఇస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో గంజాయి స్మగ్లింగ్‌, ఫైటింగ్ కూడా అదే వాహనాలతో చేస్తుంటాడు ఈ నకిలీ పోలీస్ వెంకటరమణా రెడ్డి అలియాస్ రాహుల్. ఈ నకిలీ పోలీస్ ఎంతకు బరితెగించాడంటే… ఓ చోట ఏకంగా పోలీసుల మ్యాన్ ప్యాక్ నే చోరిచేసి పారిపోయాడు. నేరాలు చేసి చేసి… చాలావరకు పోలీస్ ఆఫీసర్‌లు ఎవరో ఏ ప్రాంతంలో ఏం చేస్తున్నారు అనే విషయాలపై అవగాహన పెంచుకున్నాడు ఈ వెంకటరమణారెడ్డి. పలుమార్లు జైలుకు వెళ్ళినా తీరు మారక పోవడంతో ఇక ఈ సారి కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఇదండి ఖాకీ డ్రస్ మాటున నేరాలు చేసే ఈ నకిలీ పోలీస్ వ్యవహారం. ఖాకీ డ్రస్ లో కనిపించిన వారందరినీ పోలీసులు అనుకుంటే మీరూ మోసపోక తప్పదు. బీ అలర్ట్..!