AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : పెద్దిలో రామ్ చరణ్ రుద్ర తాండవం చూస్తారు : అనంత్ శ్రీరామ్

పెద్ది లాంటి భారీ సినిమాలో రై రై రారా లాంటి గొప్ప పాటే రాసే అవకాశం రావడం నా అదృష్టం. ఆడియన్స్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ అన్నారు. అలాగే తరాలు పాటు గుర్తుండిపోయే పాటిది అని అనంత శ్రీరామ్ అన్నారు. 

Peddi Movie : పెద్దిలో రామ్ చరణ్ రుద్ర తాండవం చూస్తారు : అనంత్ శ్రీరామ్
Peddi
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2026 | 8:20 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరిస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్‌, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్ గా అదరగొట్టింది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పెద్ది రై రై రా రా పాట విశేషాలు పంచుకున్నారు లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..

రామ్ చరణ్ గారి రుద్రతాండవం, ఏఆర్ రెహమాన్ గారి ధీర శంఖారావం, రత్నవేలు గారి చిత్రీకరణలో ఉన్న మాయాజాలం, వీటన్నిటి మధ్యలో నుంచి కూడా పాటలో లిరిక్స్ బాగున్నాయి, ఫలానా లైన్ విను, ఫలానా లైన్ బాగుంది అని అన్ని చోట్ల సాహిత్యానికి ప్రశంసలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట ఆ అదృష్టాన్ని చేసుకుందనిపించింది. నిజానికి ఇది ఒక ప్రేమ పాట కాదు, ఐటెం సాంగ్ కాదు అయినప్పటికీ కూడా లైన్స్ గురించి మాట్లాడుతున్నారు.. దీనికి కారణం ఈ పాట సాహిత్యం ఇలా రావాలన్న దర్శకుడి సంకల్పం. బుచ్చిబాబు గారు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

ఈ పాటలో ఎలాంటి సాహిత్యం ఉండాలి అనే దానిపై బుచ్చిబాబు గారు నేను చాలా సమయం కేటాయించాం. చాలా రాత్రులు రింగ్ రోడ్డు మీద అలా డ్రైవ్ చేస్తూ, కాఫీ షాపుల్లో కూర్చుని చాలా చర్చించాం. అలా నెలలు తరబడి మదనపడితే వచ్చిన పాట ఇది. ఈ తరానికి ముందు తరానికి కూడా గొప్ప సందేశాన్ని అందిస్తూనే మాస్ ని అలరించేలా ఈ పాటని రూపొందించడం జరిగింది. ఈ పాట రాయడానికి చాలా వెర్షన్స్ అనుకున్నాం. ఫైనల్ గా ఒక మంచి ప్రబోధాత్మక పాట గానే ఉండాలి అని నిర్ణయించాం. కాకపోతే ఇందులోనే వాడే భాష జనానికి దూరంగా ఉండకూడదు. వ్యవహారికంగా ఉండాలి. చెప్పే విషయం చాలా లోతుగా ఉండాలి అని బుచ్చిబాబు గారు చెప్పారని అనంత్ శ్రీ రామ్ అన్నారు. ఈ పాట ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలి అని డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పారు. ఆ మాట నాకు తారకమంత్రం లాగా పనిచేసింది. సాహిత్యంలో శ్రీశ్రీ గారి గేయ ప్రక్రియలా ఉంటే సరిపోతుందని భావించాను. అందుకే రైరై రారా పాటని ఒక గేయ కవితలాగా రాశాను. శ్రీశ్రీ గారి కవితలు చదువుతున్నప్పుడు ఎలాంటి ఉద్వేగం ఉంటుందో అలాంటి ప్రాసలతో ఈ పాట రాయడం జరిగిందని అనంత్ శ్రీ రామ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us