AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: అందరూ అనుకుంటున్నట్లు ‘టాక్సిక్’ అలాంటి సినిమా కాదు.. అంచనాలు పెంచేసిన యశ్ కామెంట్స్

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరో యశ్ టాక్సిక్ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Toxic Movie: అందరూ అనుకుంటున్నట్లు 'టాక్సిక్' అలాంటి సినిమా కాదు.. అంచనాలు పెంచేసిన యశ్ కామెంట్స్
Toxic Movie
Basha Shek
|

Updated on: Apr 15, 2026 | 9:15 PM

Share

లాస్ వెగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026 కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యశ్ సందడి చేశారు. ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి వేదికపై యశ్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘రామాయణ’ సహ నిర్మాత నమిత్ మల్హోత్ర, యశ్ ఇద్దరూ కలిసి ‘టాక్సిక్’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ జానర్ చిత్రాలకు ఇకపై అడ్రస్‌గా, గైడ్‌గా ‘టాక్సిక్’ ఉంటుందని అభివర్ణించారు. అంతర్జాతీయ వేదికపై.. యశ్ మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మేం సినిమాని చిత్రీకరించాం. ‘టాక్సిక్’లో ఎన్నో లేయర్స్‌ ఉంటాయి. ఇది రెగ్యులర్ యాక్షన్, గ్యాంగ్ స్టర్ చిత్రం కాదు. పైకి చూస్తుంటే.. ఇదొక యాక్షన్, గ్యాంగ్ స్టర్ మూవీలా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇందులో లోతైన సైకాలజీ, మనల్ని మనం చూసుకునేలా, మానవ సంబంధాలకు ప్రతీకగా ఈ చిత్రం ఉంటుంది. ఓ డార్క్ కారెక్టర్‌ను గొప్పగా చూపించారని మాత్రం చెప్పగలను. గొప్ప టెక్నీషియన్, గొప్ప దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆమె గ్యాంగ్ స్టర్ చిత్రాలకు ఓ కొత్త దారి వేసినట్టుగా అనిపిస్తుంది. నాకు ఈ ప్రాసెస్ ఎంతో నచ్చింది. నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఇదొక విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆడియెన్స్ సైకాలజీ మీద ఈ చిత్రం ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతీ వంద కిలోమీటర్లకు భాష, సంస్కృతి, సంప్రదాయాలు వేరుగా ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం ప్రతీ ఒక్కరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ అందరినీ కనెక్ట్ చేస్తుంది’ అని అన్నారు.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రంలో యష్, నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కాగా ‘టాక్సిక్’ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉండేది. ఇది బాక్సాఫీస్‌ వద్ద రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’తో పోటీ పడాల్సి ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా, విడుదలను జూన్ 4కి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, గ్లింప్స్ మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 275 SI ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 275 SI ఉద్యోగాలకు నోటిఫికేషన్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్
ఆన్‌లైన్‌లోనే లగేజీ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త సదుపాయం..
ఆన్‌లైన్‌లోనే లగేజీ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త సదుపాయం..
అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు..
అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు..
పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు..
పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు..
శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు..
శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు..
క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు..
క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు..
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..
దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి
దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి
దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్
దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్