చార్మినర్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇలా చేస్తే బొట్టు బొట్టుకు ఆహా అనాల్సిందే!
Samatha
04 march 2026
ఇరానీ టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ఇరానీ టీ తాగుతుంటారు.
ఇరానీ టీ
మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో చార్మినార్ దగ్గర , ఇరానీ టీ తాగితే టేస్టే వేరుంటుంది. అందుకే చాలా మంది చార్మినార్ వెళ్లిన ప్రతిసారీ ఇరానీ టీ తాగుతుంటారు.
చార్మినార్ స్పెషల్
అయితే , ఇరానీ టీ తాగాలి అనిపించిన ప్రతీ సారీ మనం చార్మీనార్ వెళ్లలేం కదా, అందుకే చార్మినార్ స్పెషల్, ఇరానీ టీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే?
ఇరానీ తయారీ
కావాల్సిన పదార్థాలు : ఫుల్ క్రీమ్ పాలు మూడు కప్పులు, నీళ్లు ఒక కప్పు, నాణ్యమైన టీ పొడి రెండు టేబుల్ స్పూన్స్, చక్కెర రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్, యాలకు మూడు, కండెడన్స్డ్ మిల్క్ వన్ టేబుల్ స్పూన్.
కావాల్సిన పదార్థాలు
తయారీ విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి బాగా మరగ బెట్టాలి. నీళ్లు బాగా మరిగే సమయంలో అందులో టీ పొడి వేయాలి.
తయారీ విధానం
తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, సుమారు ఏడు నిమిషాల పాటు టీ పౌడర్ , నీళ్లు మరిగేలా చూసుకోవాలి. అది రంగు మారిన తర్వాత ఆనీటిలో నుంచి డికాషన్ వేరు చేయాలి.
టీ పౌడర్, నీళ్లు
తర్వాత మరో బౌల్ పెట్టి అందులో ఫుల్ మిల్క్ పోసి బాగా మరగబెట్టి, పాలు చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో కాస్త చక్కెర వేసి మరికొద్ది సేపు మరగ బెట్టాలి.
పాలు మరగడం
ఇప్పుడు మనం ముదుగా చేసుకున్న డికాషన్ వాటర్ వేయాలి. అందులోనే యాలకు వేయండి. అంటే టేస్టీ టేస్టీ చార్మినార్ స్పెషల్ ఇరానీ టీ రెడీ.