మంత్రికి కొర్రమీను చేపలు ఇచ్చిన మత్య్సకారులు.. మినిస్టర్ రియాక్షన్ ఏంటంటే..!
మంత్రికి కొర్రమీను చేపలందజేసిన మత్స్యకారులు, మత్స్య సంపదతో వారు ఆనందంగా ఉన్నారన్న మంత్రి తెలంగాణలో మత్స్య సంపద బాగా పెరిగిందన్నారు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో మత్స్యకారులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ కు చెందిన మత్స్యకారులు తలసానికి కొరమీను చేపలను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా […]
మంత్రికి కొర్రమీను చేపలందజేసిన మత్స్యకారులు, మత్స్య సంపదతో వారు ఆనందంగా ఉన్నారన్న మంత్రి తెలంగాణలో మత్స్య సంపద బాగా పెరిగిందన్నారు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో మత్స్యకారులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ కు చెందిన మత్స్యకారులు తలసానికి కొరమీను చేపలను అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు మంత్రి తలసాని. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ..
ప్రభుత్వ చర్యలతో మత్స్యకారుల ఆదాయం ఎంతో పెరిగిందని చెప్పారు. అందరం చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. తమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మత్స్యశాఖ మంత్రికి కొరమీను చేపలను అందిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు దళిత బంధు పథకంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు వాహనాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి తలసాని పంపిణీ చేశారు.