Telangana Corona: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ముఖ్యంగా ఆ జిల్లాలో..

Telangana Corona: మహమ్మారి మరోసారి పంజా విసురుతుందా.. కొత్తగా పెరుగుతోన్న కేసులు ఫోర్త్ వేవ్‌కు సంకేతమా అంటే అవుననే నిపుణుల నుంచి సమాధానం వస్తుంది.

Telangana Corona: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ముఖ్యంగా ఆ జిల్లాలో..
Corona
Follow us

|

Updated on: Jun 08, 2022 | 11:09 PM

Telangana Corona: మహమ్మారి మరోసారి పంజా విసురుతుందా.. కొత్తగా పెరుగుతోన్న కేసులు ఫోర్త్ వేవ్‌కు సంకేతమా అంటే అవుననే నిపుణుల నుంచి సమాధానం వస్తుంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కేవిడ్ ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరూ డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు ఇమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో థర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఫోర్ట్ వేవ్ కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనని.. అయితే జాగ్రత్తలు మాత్రం మస్ట్ అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.  ప్రజలు ప్రజంట్ మాస్కులు పెట్టుకోవడం మానేశారు. సమూహాలుగా ఉంటున్నారు. శానిటైజర్ వినియోగిస్తున్న వాళ్లు అయితే చాలా అరుదనే చెప్పాలి. కానీ జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. ఎందుకంటే మహమ్మారి తన రూపాన్ని మార్చుకుని.. ఎప్పుడు ఎంత తీవ్రత చూపిస్తుందో చెప్పలేం.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 13,920 మంది శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా 116 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో నేడు 43 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.51 శాతం ఉండగా.. రికవరీ రేటు 99.39 శాతంగా ఉంది. ప్రస్తుత రాష్ట్రంలో 731 యాక్టీవ్ కేసలు ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,51,05,939 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. 7,93,907 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 7,89,065 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలాఉంటే.. తాజాగా రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 83 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.