Mrigashira Karte 2022: మృగశిరకార్తెలో చేప సెంటిమెంట్.. 900 టన్నుల అమ్మకాలు జరిగే ఛాన్స్..!
Mrigashira Karte 2022: మృగశిరకార్తె వచ్చిందంటే.. మత్స్య శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. మృగశిర ప్రవేశం రోజున .. చేపలు తింటే
Mrigashira Karte 2022: మృగశిరకార్తె వచ్చిందంటే.. మత్స్య శాఖకు కాసుల వర్షం కురుస్తోంది. మృగశిర ప్రవేశం రోజున .. చేపలు తింటే మంచిదనే సెంటిమెంట్ తో చేపల అమ్మకాల ప్రతి ఏటా పెరుగుతునే ఉన్నాయి. సాధారణ అమ్మకాలతో పోల్చితే మృగశిర కార్తె ప్రారంభంలో అమ్మకాలు మూడు రెట్లు సాగుతున్నాయి. ఈఏడాది కూడా చేపల అమ్మకాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి.
హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద చేపల మార్కెట్ గా ముషీరాబాద్, బేగంబజార్ లు ఉన్నాయి. ముషీరాబాద్ లో 70 నుంచి 80 టన్నుల చేపల అమ్మకాలు సాగుతుంటే, బేగం బజార్ లో 40 టన్నుల అమ్మాకాలు సాగుతాయి. ఇతర అవుట్‌లెట్ మార్కెట్లలో 70 టన్నులు వరకు అమ్మకాలు సాగుతున్నాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో మార్కెట్‌ల ద్వారా సుమారు 160-180 టన్నుల చేపలు అమ్మకాలు సాగుతున్నాయి. సాధారణంగా ఈ అమ్మకాలు ఆదివారం రెట్టింపు అవుతుంది. అయితే.. ఈ మృగశిరకార్తె ప్రారంభంనుంచి అమ్మాకాలు బాగా ఊపందుకుంటాయి. ఈ సరాసరిన ఈకాలంలో 900 టన్నుల చేపల అమ్మకాలు అవుతాయని అంచనా వేస్తోంది తెలంగాణ ఫిషరీస్ డిపార్టుమెంట్. ఎప్పుడూ మృగశిర కార్తె లో చేపలఅమ్మకాలు మూడు రెట్లు అధికంగా సాగుతాయని తెలంగాణ మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీ కృష్ణ చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఫిషరీస్ డిపార్టుమెంట్ నుంచి సరఫరా సాగుతోందంటున్నారు.
చేపల అమ్మకాలకు… వినియోగానికి తెలంగాణ లో ప్రధానంగా రెండు సీజన్లకు మత్స్య శాఖ రెడీ అవుతుంది. మృగశిర కార్తె ఒకటైతే.. బత్తిన చేపప్రసాదం మరొకటి. చేప ప్రసాదం పంపిణీకి ఈ ఏడాది కూడా బత్తిని సోదరులు చేపల కోసం ఆర్డర్లు ఇవ్వ లేదు. దీంతో మత్స్య శాఖ ఆందోళన చెందినా.. ఈ మృగశిర కార్తి కి మంచి విక్రయాలు జరగడం ఆశాజనకంగా మారింది. కరోనా కాలంలో మార్కెట్ లో కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మార్కెట్లలో మహమ్మారి అడ్డంకులు తొలగిపోయాయి. చేపల అమ్మకాలు నాలుగు నుండి ఐదు రెట్లు పెరుగుతాయని మత్స్య శాఖ అంచనాలు వేస్తోంది. కనీసం 50 లక్షల కుటుంబాలు.. కనీసం 1 కేజీ చేపలను మృగశిర కార్తె కాలంలో తింటారనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ వినియోగం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.9 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి జరిగింది. ఇందులో 40 శాతం స్థానికంగా అమ్మాకాలు సాగితే, మిగిలినవి జనవరి నుండి జూన్ వరకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతిచేశారు. అదే నాన్-పీక్ సీజన్‌లో జూలై నుండి డిసెంబర్ వరకు రివర్స్ ట్రెండ్ ఉంటుంది. చేప పిల్లలను పెంపకానికి అనుకూలంగా విధానాలు నడుస్తాయి.
అయితే.. గత మూడేళ్లలో వినియోగం గణనీయంగా పెరిగింది. కానీ పోషకాహార నిపుణులు, NIN లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు సూచించిన సగటు కంటే చేపల వినియోగం ఇంకా తక్కువగానే ఉంది. ప్రతి వ్యక్తి సంవత్సరానికి 12 కిలోల వినియోగం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ ప్రతి వ్యక్తి సంవత్సరానికి 8-9 కిలోలు మాత్రమే తెలంగాణలో వినియోగం చేస్తున్నాడు. ఇది బాగా పెరగాల్సిన అవసరం ఉంది. దీని కోసం ఫిషరీస్ డిపార్టుమెంట్ అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తునే ఉంది. దీనికి మృగశిర కార్తె సెంటిమెంట్ కాలంలో చేపలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. దీనికి అనుగుణంగానే అమ్మకాలు సాగుతున్నాయి.
వై. గణేష్, టివి9 తెలుగు, హైదరాబాద్.