Road Accident : ఇరుకైన రహదారిలో వెయ్యి మీటర్లకు పైగా లోతైన లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 22మంది మృతి

కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ వ్యాన్‌ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృత్యువాతపడ్డారు. జోబ్‌ నేషనల్‌ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో..

Road Accident : ఇరుకైన రహదారిలో వెయ్యి మీటర్లకు పైగా లోతైన లోయలోకి దూసుకెళ్లిన వ్యాన్‌.. 22మంది మృతి
Follow us

|

Updated on: Jun 08, 2022 | 8:25 PM

పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ వ్యాన్‌ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృత్యువాతపడ్డారు. జోబ్‌ నేషనల్‌ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో ప్రమాదం జరిగినట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, ఇందులో 22 మంది మరణించినట్లు పేర్కొంది.ఈ ప్రమాదం నుండి ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో బయటపడ్డట్లు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బుధవారం ఉదయం 23 మందితో వ్యాన్‌ జోబ్‌కు వెళ్తున్న సమయంలో.. అక్తర్‌ జాయ్‌ సమీపంలో కొండపై నుంచి అదుపుతప్పి వ్యాన్‌ లోయలో పడిపోయిందని జిల్లా డిప్యూటీ కమిషనర్‌ హఫీజ్‌ ముహమ్మద్‌ ఖాసిం తెలిపారు. వ్యాన్‌ అదుపుతప్పి 1,572 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదంలో చిన్నారి బాలుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడని తెలిపారు.చికిత్స కోసం బాలుడిని క్వెట్టాకు తరలించినట్లు చెప్పారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా మొత్తం 22మంది మరణించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తగిన వైద్యం అందించాలని అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం,ఇక్కడి ప్రమాదకర కొండ ప్రాంతాల కారణంగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వందల మంది ప్రజల ప్రాణాలను ఇక్కడి రహదారులు బలిగొంటున్నాయి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు