Viral: ఫ్రెండ్స్ చెప్పారని వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. చివరకు ఊహించని ట్విస్ట్

అతి ఎంత అనర్థమో చెప్పే సంఘటన ఇది. ఫ్రెండ్స్ చెప్పారని ఓ వ్యక్తి మోతాదుకు మించి వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు.. చివరకు

Viral: ఫ్రెండ్స్ చెప్పారని వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్త పెళ్లి కొడుకు.. చివరకు ఊహించని ట్విస్ట్
Viagra
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2022 | 8:08 PM

Trending News: ఎనర్జీ పెంచుకునేందుకు, ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనేందుకు, అంగ స్తంభన వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొందరు వయాగ్రా ట్యాబ్లెట్స్ వాడతారన్న విషయం తెలిసిందే. అయితే వీటిని కూడా అందరూ ఎలా పడితే అలా తీసుకోకూడదు. కొన్ని రకాలు వ్యాధులు ఉన్నవాళ్లు ఇవి తీసుకోకూడదని డాక్టర్లు చెబుతారు. ఎంత వాడాలి.. ఎలా వాడాలి అన్న విషయాల్లో డాక్టర్ల సూచనలు తీసుకోవాలి. ఏదైనా అతి అయితే సమస్యలు తప్పవు. తాజాగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన ఓ కొత్త పెళ్లి కొడుకు వయాగ్రా(Viagra)ట్యాబ్లెట్ల విషయంలో లిమిట్ క్రాస్ చేశాడు. ఇప్పుడు ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. UPలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ యువకుడికి ఇటీవలే పెళ్లి అయ్యింది. అతనికి ఎలాంటి శృంగార పరమైన ఇబ్బందులు లేవు. కానీ, కొంతమంది వెదవ ఐడియాలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా..!. అతనికి కూడా అలాంటి ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. వారు ఓ దరిద్రపు ఐడియా ఒకటి ఇచ్చారు. శృంగారాన్ని ఎక్కువ సేపు ఎంజాయ్ చేయాలంటే వయాగ్రా మాత్రాలు వేసుకోవాలని  చెప్పారు. అతను కూడా ఏమీ ఆలోచించకుండా వారు చెప్పినట్లే చేశాడు.  ఆ యువకుడు రోజూ వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకొని భార్యతో శృంగారంలో పాల్గొనేవాడు.  డోస్ పెంచితే  ఇంకా బెటర్ అని అతను అనుకున్నాడు. రోజులు గడిచే కొద్ది డోస్ పెంచుకుంటూ పోయాడు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 50 మిల్లీ గ్రాముల వరకు మాత్రమే వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటిది అతడు ఏకంగా 200 మిల్లీ గ్రాముల వరకు వెళ్లాడు. అలా 20 డేస్ కంటిన్యూ చేశాడు.

డోస్ మించడంతో అతనికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అతడి అంగం గంటల తరబడి స్తంభించే ఉండిపోయేది. భర్త ఇబ్బందిని చూసి.. అక్కడ ఉండలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు అతను ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వయాగ్రా వల్ల అతడిలో `ప్రియపిజం` సమస్య తలెత్తిందని అతడిని టెస్టులు చేసిన డాక్టర్లు తెలిపారు. ప్రియపిజం అంటే అంగం.. అలాగే స్తంభించి ఉండడం. దీంతో అతని అంగాన్ని సరిచేసేందుకు డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేశారు. అయినా నో యూజ్. అయితే శృంగారంలో పాల్గొనే విషయంలోనూ, పిల్లలు పుట్టడంలోనూ అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని, అయితే అంగ పరిమాణం మాత్రం పెద్దగానే ఉంటుందని డాక్టర్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..