AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannabis Cultivation: గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్.. కానీ అలా చేస్తే భారీ జరిమానా

Cannabis: థాయ్‌లాండ్‌లో గంజాయి సాగును చట్టబద్ధం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం జైలులో ఉన్న ఖైదీల సంఖ్య మాత్రమే కాదు. మరో కారణం కూడా ఉంది. గంజాయిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రతి సంవత్సరం రూ.15,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Cannabis Cultivation: గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్.. కానీ అలా చేస్తే భారీ జరిమానా
Ganja
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2022 | 3:47 PM

Share

Marijuana Cultivation: థాయిలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగు, దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం.. దానిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించింది. దీనిని కేవలం వైద్య వినియోగానికి మాత్రమే అంటూ స్పష్టం చేసింది. అయితే ఇలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని నిషేదం కొనసాగుతుందని తెలిపింది. ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.

గంజాయి సాగుకు ఈ దేశ ప్రభుత్వం చట్టపరమైన ఆమోదం తెలిపిన తేదీ 8 జూన్ 2022. ఇందుకోసం కొన్ని షరతులు కూడా పెట్టినప్పటికీ పలు ఆంక్షలు కూడా విధించారు. నిషేధిత మాదక ద్రవ్యాల జాబితా నుంచి ఇక్కడి ప్రభుత్వం మరువానాను తొలగించింది. అంటే ఇప్పుడు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లలో కూడా గంజాయిని పండించవచ్చు.

గంజాయిని చట్టబద్ధం చేయడానికి కారణం ఇదే..

ఇవి కూడా చదవండి

గంజాయి పండించి దొరికినవారు కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఖైదీలు జైళ్లలో ఉన్న దేశం థాయ్‌లాండ్. విచిత్రం ఏమిటంటే.. ఈ జైళ్లలో ఉన్న ఖైదీల్లో దాదాపు 80 శాతం మంది డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో పట్టుబడినవారే. ఈ నివేదిక తర్వాత 2021 సంవత్సరంలోనే ప్రభుత్వం డ్రగ్స్‌కు సంబంధించిన నిబంధనలలో సడలింపు ఇవ్వడం ప్రారంభించింది.

నిబంధనలలో చాలా మార్పులు చేయబడ్డాయి. మాదకద్రవ్యాలకు సంబంధించిన అనేక నేరాలు వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. అదే సమయంలో ఈ దేశంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు గంజాయిని వినోద వినియోగానికి ఆమోదం కోరడం ప్రారంభించారు.

కాగా, గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది. గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు,నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు.

గంజాయి సాగు నియమాలు ఇలా..

  1. – థాయ్‌లాండ్ ప్రజలు తమ ఇంటి వద్ద గరిష్టంగా 6 గంజాయి మొక్కలు నాటడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
  2. – గంజాయి సాగు కోసం, ప్రజలు ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి.
  3. – కంపెనీలు కూడా నిర్ణీత పరిమాణంలో సాగు చేయడానికి అనుమతించబడతాయి. దీని కోసం వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతిని కలిగి ఉండాలి.
  4. – హోటల్‌లు, రెస్టారెంట్లు గంజాయితో తయారు చేసిన ఆహారం లేదా పానీయాలను కూడా అందించవచ్చు.
  5. – థాయిలాండ్‌లోని ఆసుపత్రులు రోగుల చికిత్సలో గంజాయి వాడకాన్ని కూడా ఆమోదించింది.

కొత్త చట్టం అమలు తర్వాత ఇక్కడ ఎక్కువ జైళ్లలో ఉన్న 4 వేల మంది ఖైదీలను త్వరలో జైళ్ల నుంచి విడుదల చేయనున్నారు. థాయ్‌లాండ్‌లో గంజాయి సాగును చట్టబద్ధం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం జైలులో ఉన్న ఖైదీల సంఖ్య మాత్రమే కాదు. మరో కారణం కూడా ఉంది. గంజాయిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రతి సంవత్సరం రూ.15,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. థాయ్‌లాండ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సుమారు ఒక మిలియన్ గంజాయి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించడానికి కారణం ఇదే.