NT Rama Rao: అన్నగారి అభిమానులకు గుడ్‌న్యూస్.. రూ.100 నాణేంపై NTR బొమ్మ..

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి పురంధేశ్వరి.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం వాడుకలోకి వచ్చే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.

NT Rama Rao: అన్నగారి అభిమానులకు గుడ్‌న్యూస్.. రూ.100 నాణేంపై NTR బొమ్మ..
Ntr
Follow us

|

Updated on: Jun 10, 2022 | 11:06 AM

NTR Birth Anniversary Celebrations: నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మను ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి పురంధేశ్వరి.. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న రూ.100 నాణెం వాడుకలోకి వచ్చే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం రాబోతోందని, ఈ విషయమై ఆర్బీఐతో మాట్లాడుతున్నామని ప్రకటించారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ వంద నాణేంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణకు సుముఖత వ్యక్తంచేయడం పట్ల.. ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

తిరుపతిలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. మహానాయకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. తిరుపతి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమని.. రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ఆయన ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ శత జయంతి వేడుకలకు రావాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తిరుపతిలో జరిగిన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందంటూ పురంధేశ్వరి పేర్కొన్నారు. అయితే.. అన్నగారి శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సారైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు, పలువురు ప్రముఖులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..