AP TET 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలు..
AP TET 2022: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డీఎస్‌స్సీకి సంబంధించి తొలి అడుగుపడింది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది...
AP TET 2022: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డీఎస్‌స్సీకి సంబంధించి తొలి అడుగుపడింది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆగస్టు 31 టెట్ పరీక్ష కీని విడుదల చేయనున్నారు. తర్వాత సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
టెట్ ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్‌లైన్ పరీక్ష సూచనలు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే టెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ టెట్ 2022 పూర్తి సమాచారం..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..