Teenager Gets Banned: 14 ఏళ్ల బాలుడికి వణికిపోతున్న పట్టణ ప్రజలు, నగర బహిష్కరణ వేటువేసిన కోర్టు!
రాజుల కాలంలో తప్పుచేసిన వారికి విధించే శిక్షలు విచిత్రంగా ఉండేవి. గ్రామ బహిష్కరణ, పట్టణ బహిష్కరణ, రాజ్య బహిష్కరణ వంటి శిక్షలు విధించేవారు. తాజాగా, రాజమౌళి బహుబలి సినిమాలోనూ రాజ్యబహిష్కరణ అనే శిక్ష విధించటం చూశాం. అది సినిమా.. కానీ,
రాజుల కాలంలో తప్పుచేసిన వారికి విధించే శిక్షలు విచిత్రంగా ఉండేవి. గ్రామ బహిష్కరణ, పట్టణ బహిష్కరణ, రాజ్య బహిష్కరణ వంటి శిక్షలు విధించేవారు. తాజాగా, రాజమౌళి బహుబలి సినిమాలోనూ రాజ్యబహిష్కరణ అనే శిక్ష విధించటం చూశాం. అది సినిమా.. కానీ, ప్రస్తుత కాలంలోనూ ఓ దేశంలో ఇలాంటి శిక్షలు అమలు చేస్తున్నారు. అది కూడా ఓ 14ఏళ్ల బాలుడికి నగర బహిష్కరణ శిక్ష వేసింది కోర్టు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. అసలు విషయం ఎంటంటే…
బహిష్కరణ వేటు పడిన ఆ 14బాలుడి పేరు కిల్యాన్ ఎవాన్స్, యూకేలోని కిడ్డెర్‌మిన్‌స్టర్‌లోని వోర్సెస్టర్‌షైర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అతడి ప్రవర్తనతో పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని చంపేస్తామని బెదిరిస్తున్నాడంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇచ్చి పంపేశారు. పిల్లాడే కదా అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ, వాడి ప్రవర్తలో మార్పురాలేదు. పైగా మరింత రెచ్చిపోయి స్థానిక వ్యాపారులను, ప్రజలను భయపెడుతూ మరింగా రెచ్చిపోయాడు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అందరినీ బెదిరిస్తున్నాడు. దాంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పోలీసులకు మొరపెట్టుకున్నారు. తమను కాపాడాలంటూ వేడుకున్నారు. దాంతో ఇక చేసేది లేక పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దాంతో పూర్తి విచారణ అనంతరం అతడిపై కోర్టు ‘క్రిమినల్ బిహేవియర్ ఆర్డర్ (CBO)’ను అమలు చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు.. ఆ బాలుడు ఇక ఆ పట్టణంలో కనిపించకూడదు. 2025 మే నెల వరకు అతడు ఆ ఊరిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. అలాగే అతడు బహిరంగ ప్రదేశాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి కనిపించకూడదు.అలా కాదని కోర్టు ఆదేశాలు అతిక్రమించి, కనబడితే భారీ జరిమానా లేదా కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.