Viral Video: సన్నీ లియోన్‌ను స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టిన స్నేహితుడు.. ఇలా ప్రతీకారం తీర్చుకుంది..వైరల్ వీడియో..
Sunny Leone Viral Video: ప్రతి రోజు నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఇలా పోస్టు చేసిన వెంటనే అవి మరింత వైరల్ అవుతుంటాయి. తాజాగా సన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియో..
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో ఉంటాయి. ప్రతి రోజు నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఇలా పోస్టు చేసిన వెంటనే అవి మరింత వైరల్ అవుతుంటాయి. తాజాగా సన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సన్నీ లియోన్ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఇది చూస్తే మీకు కూడా నవ్వు వస్తుంది. ఈ వైరల్ వీడియోలో సన్నీ లియోన్ స్విమ్మింగ్ పూల్ పక్కన బాత్ రోబ్‌లో నడుచుకుంటూ వెళ్లడాన్ని మీరు చూడవచ్చు.
ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి..
View this post on Instagram
సన్నీ స్నేహితురాలు ఓ చిలిపి పని చేశారు
సన్నీ లియోన్ బాత్ రోబ్‌లో సన్నీ తనదైన శైలిలో స్విమ్మిగ్ పూల్ అంచుపై నెమ్మదిగా నడుస్తోంది. ఆమె స్నేహితుడు పరుగున వచ్చి ఆమెను స్విమ్మింగ్ పూల్ లోకి తోశాడు. సన్నీ నేరుగా నీటిలో పడిపోతుంది. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన సన్నీ లియోన్ చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. సన్నీ తన స్నేహితుడిని చెప్పులు తీసి కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు.
సన్నీ వీడియో వైరల్‌గా మారింది
ఈ వీడియోను సన్నీలియోన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆమె క్యాప్షన్‌లో రాసింది ‘దీనికి ప్రతికారం త్వరలో వస్తుంది, నేను నా ప్రతీకారం తీర్చుకుంటాను.’ అంటూ సరదాగా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు స్పందిస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 29 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.