Airport Mask: దేశంలో మరోమారు కరోనా ఆంక్షలు..! మాస్క్ లు వేసుకోకపోతే దించేయండి.. డీజీసీఏ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు చాపకింద నీరుల వ్యాపిస్తున్నాయి. రోజు రోజుకూ నెమ్మదిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు మూడు నెలల తరువాత భారీ సంఖ్యల కేసులతో పాటుగా మరణాలు నమోదుకావటం ఆందోళనకలిగిస్తోంది..
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు చాపకింద నీరుల వ్యాపిస్తున్నాయి. రోజు రోజుకూ నెమ్మదిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు మూడు నెలల తరువాత భారీ సంఖ్యల కేసులతో పాటుగా మరణాలు నమోదుకావటం ఆందోళనకలిగిస్తోంది.. దీంతో..కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు తగు సూచనలు చేసింది. కేసులు నమోదు ఆధారంగా అయిదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కు ధరించని ప్రయాణికులను బోర్డింగ్ అయ్యే ముందే నిలిపేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో, విమానాల్లో మాస్క్ ధరించడం డీజీసీఏ తప్పనిసరి చేసింది. ఫ్లైట్ లో మాస్క్ పెట్టుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని దించేసి మరీ వెళ్లాలంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి అడుగుపెట్టాలంటే మాస్క్ ఉందా లేదా అని చూస్కొని మరి వెళ్తున్నారు.
దేశంలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు విమానయాన సిబ్బంది నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించి డీజీసీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన సూచనలకు బదులుగా.. తాజాగా విడుదల చేసిన నిబంధనలు అమలు చేయాలని సర్క్యులర్ విడుదల చేసింది. ఇక బోర్డింగ్ లాంజ్ లోకి వెళ్లిన ప్రయాణికులకు విమానయాన సంస్థలు మాస్క్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కోవిడ్ నియంత్రణకు స్ట్రిక్ట్ గా మార్గదర్శకాలు పాటించేలా సిఐఎస్ఎఫ్, భద్రతా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డిజిసిఎ ఆదేశాలను ఎక్కువ మంది ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.