Couple Driving: ఇసుక తిన్నెలపై ఆ ఇద్దరు..! SUV కారులో ఎంజాయ్‌ చేస్తూ పట్టుబడ్డారు.. రూ.50వేల జరిమానా..!

కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని పాడుచేస్తుంటారు. అలాగే తమ చుట్టుపక్కల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు..అనేది కూడా గ్రహించారు. నిషేధిత ప్రాంతాల్లో పర్యాటకులు ..

Couple Driving: ఇసుక తిన్నెలపై ఆ ఇద్దరు..! SUV కారులో ఎంజాయ్‌ చేస్తూ పట్టుబడ్డారు.. రూ.50వేల జరిమానా..!
Couple Driving
Jyothi Gadda

|

Jun 10, 2022 | 7:54 PM

కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని పాడుచేస్తుంటారు. అలాగే తమ చుట్టుపక్కల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు..అనేది కూడా గ్రహించారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని చూసే ప్రతిఒక్కరూ భావిస్తుంటారు..సరిగ్గా ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నిషేధిత ప్రాంతాల్లో కారు నడుపుతూ ఎంజాయ్ చేస్తున్న దంపతులకు రూ. 50 వేల జరిమానా విధించారు పోలీసులు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కథనంతో పాటు ఓ ఫోటో కూడా వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

జైపూర్ కు చెందిన ఓ భార్యాభర్తలు నుబ్రా వ్యాలీలోని హండర్ ఇసుక తిన్నెలపై తమ కారుతో తెగ ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని లేహ్ పోలీసులు గమనించి వారిని పట్టుకున్నారు. సహజ ప్రకృతి దృశ్యాన్ని దెబ్బతీస్తున్నందున మరియు నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందున వారికి రూ. 50 వేల జరిమానా విధించారు. ఇలాంటి చర్యలు సుందరమైన లడఖ్‌ను నాశనం చేస్తాయని లేహ్ పోలీసులు అంటున్నారు. ఈ మేరకు లెహ్ పోలీసులు ఫేస్‌బుక్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసారు. టయోటా ఫార్చ్యూనర్ SUVని నుబ్రా వ్యాలీలోని హుండర్‌లో ఇసుక తిన్నెలపై నడుపుతున్నట్లుగా ఈ ఫొటోల్లో కనిపిస్తుంది.

లడక్ లోని నిషేధిత ప్రాంతాల్లో పర్యాటకులు ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతున్న ఫొటోలు దొరికాయి. ఇలాంటి చర్యలు సుందరమైన లడఖ్‌ను నాశనం చేస్తాయని లేహ్ పోలీసులు అంటున్నారు. ఈమేరకు లెహ్ పోలీసులు ఫేస్‌బుక్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసారు, టయోటా ఫార్చ్యూనర్ SUVని నుబ్రా వ్యాలీలోని హుండర్‌లో ఇసుక తిన్నెలపై నడుపుతున్నట్లుగా ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. SUV వాహనం లైసెన్స్ ప్లేట్ మీదున్న నెంబర్ ప్రకారం.. ఇది ఢిల్లీ-రిజిస్టర్డ్ వాహనం అని తెలుస్తోంది. ఈ ఎడారి ప్రాంతం సాహస ప్రియులకు ప్రసిద్ధి చెందింది. చల్లని ఎడారి ప్రకృతి దృశ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ విషయం తెలిసి నెటిన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మంచి పని చేశారు అంటూ ఓ వ్యక్తి కామెంట్ పోశాడు. హ్యాట్సాప్ పోలీస్ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఇకపోతే, నుబ్రా వ్యాలీ లేహ్‌కు ఉత్తరం వైపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడే ష్యోక్, సియాచాన్ నదులు కలుస్తాయి. ఈ లోయ లడఖ్‌ను కారకోరం శ్రేణులు, సియాచిన్ హిమానీనదం నుండి వేరు చేస్తుంది. ఏప్రిల్‌లో, ఇద్దరు పర్యాటకులు వాహనంలో సన్‌రూఫ్‌లోంచి బైటికి చూస్తూ కేకలు వేస్తూ, పాంగోంగ్ సరస్సు గుండా ఆడి SUV రేసింగ్‌ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీద విస్తృతంగా విమర్శలు వచ్చాయి. ఆడి SUVకి హర్యానా లైసెన్స్ ప్లేట్ ఉంది. అంతేకాదు ఈ వీడియోలో ఫోల్డబుల్ కుర్చీలు, మద్యం సీసాలు, నీరు, చిప్స్ ప్యాకెట్లతో కూడిన టేబుల్ కూడా కనిపించింది. దీని ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని తర్వాత పరిపాలన 50 వేల జరిమానా వసూలు చేయడంతో యూజర్ల ఆగ్రహం కాస్త చల్లారినప్పటికి ఈ ఫోటో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu